Asianet News TeluguAsianet News Telugu

జేడీ గారు.. సినిమాల్లో నటిస్తే తప్పేంటి...? పవన్ కి మద్దతుగా నిలిచిన టీడీపీ

ఓ వైపు పింక్ రిమేక్ సినిమాలో నటిస్తూనే... మరో మూడు సినిమాలకు సంతకం చేశాడు. రాజకీయాలను పట్టించుకోకుండా పవన్ సినిమాల్లో నటించడానికి వెళ్లడం ఆ పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణకు నచ్చలేదు. దీంతో... ఆయన ఇటీవల పార్టీని వదిలేశారు. 

TDP Leader Somireddy Chandra shekhar Reddy huge support to pawan overActing in Films
Author
Hyderabad, First Published Jan 31, 2020, 11:43 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి టీడీపీ మద్దతుగా నిలిచింది. పవన్ చివరగా అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయాలో బిజీగా గడుపుతూ వచ్చారు. ఇక పవన్ నుంచి సినిమా రాదు అని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. 

అయితే... గడిచిన ఎన్నికల్లో పవన్ రాజకీయంగా ఎలాంటి ప్రాబల్యం చూపించలేకపోయారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేయాలని ఆయన యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. మళ్లీ ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉండటంతో... ఒకవైపు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే తాజాగా ఆయన సినిమాలపై దృష్టి సారించారు.

Also Read రాజీనామా ఆమోదం: జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు...

ఓ వైపు పింక్ రిమేక్ సినిమాలో నటిస్తూనే... మరో మూడు సినిమాలకు సంతకం చేశాడు. రాజకీయాలను పట్టించుకోకుండా పవన్ సినిమాల్లో నటించడానికి వెళ్లడం ఆ పార్టీ నేత మాజీ జేడీ లక్ష్మీనారాయణకు నచ్చలేదు. దీంతో... ఆయన ఇటీవల పార్టీని వదిలేశారు. పవన్ సినిమాల్లోకి వెళ్లడం ఇష్టంలేకనే తాను పార్టీని వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. దానికి పవన్ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తాను కేవలం పార్టీ కార్యకర్తల కోసమే సినిమాల్లో నటిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కాగా... ఈ విషయంలో జనసేనానికి టీడీపీ మద్దతుగా నిలిచింది. పవన్ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటిచారని.. అలాంటప్పుడు పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమి లేదంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios