కడప: కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో భారీ షాక్ తగలనుంది. పులివెందులలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సతీష్ రెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు.

ఇప్పటికే కడప డిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది పెద్ద నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ గాలం వేస్తోంది. 

Also Read: బాబుకు షాక్: వైసీపీలోకి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి?

పార్టీ మార్పు విషయంపై చర్చించేందుకు సతీష్ రెడ్డి మంగళవారం తన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉంది. 

సతీష్ రెడ్డి పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపై, వైఎస్ జగన్ పై పోటీ చేశారు. ఆ రకంగా పులివెందుల నియోజకవర్గంలో చంద్రబాబుకు సతీష్ రెడ్డి పార్టీ మారడం వల్ల పెద్ద దెబ్బనే తగిలే అవకాశం ఉంది. 

Also read: వైసీపీలో చేరిన డొక్కా, మరో మాజీ ఎమ్మెల్యే: ఒక్కరోజే టీడీపీకి రెండు షాకులు

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయన రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత రామసుబ్బా రెడ్డి తీవ్రంగా చిక్కులు ఎదుర్కుంటున్నారు. అయినప్పటికీ ఆయన టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. కానీ, వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.