కరోనా: మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి సోమవారం నాడు మరణించారు. కరోనాతో  ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

TDP leader Sabbam Hari passes away in Visakhapatnam lns

మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి సోమవారం నాడు మరణించారు. కరోనాతో  ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1952 జూన్ 1వ తేదీన ఆయన జన్మించారు. సబ్బం హరికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 2019 ఎన్నికల్లో సబ్బం హరి భీమిలీ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. చివరి నిమిషంలో ఆయన టీడీపీలో చేరాడు. 

 

 

 

1952 జూన్ 1వ తేదీన ఆయన జన్మించారు. సబ్బం హరికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1970 అక్టోబర్ 15న లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు సబ్బం హరి.2017లో ఆయన భార్య అనారోగ్యంతో మరణించారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస.స్వగ్రామంలోనే  పాఠశాల విద్యను ఆయన పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీని ఎవీఎన్ కాలేజీలో చదివారు. డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే  అనేక వ్యాపారాలు చేశారు. ఈ వ్యాపారాల్లో నష్టం రావడంతో ఆయన వాటికి గుడ్ బై చెప్పారు.

1985లో ఆయన విశాఖ నగర కమిటీలో కార్యదర్శిగా నియమితులయ్యారు.  విశాఖ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ను ఆయన తిరస్కరించారు. 1995లో విశాఖ మేయర్ గా ఆయన ఎన్నికయ్యారు. అవినీతి ఆరోపణలు లేకుండానే మేయర్ గా ఆయన పాలన సాగించారు.  అనకాపల్లి ఎంపీగా కూడ సబ్బం హరి పనిచేశారు. 

రెండు వారాల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. సబ్బం హరికి కరోనాతో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా వైద్యులు చెప్పారు. శ్వాస సంబంధమైన సమస్యలతో ఆయన తీవ్రంగా బాధపడ్డారని వైద్యులు గుర్తు చేశారు. ఆయనను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టుగా వైద్యులు తెలిపారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో  ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న నేతల్లో  సబ్బం హరి కూడ ఒకరు.  ఆ తర్వాత ఆయన వైఎస్ జగన్ వెంట కూడ నడిచారు. జగన్ ను సీబీఐ అరెస్ట్ చేసిన సమయంలో జగన్  కుటుంబంతో పాటు సబ్బం హరి కూడ  ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనను నిరసిస్తూ జరిగిన ఉద్యమాల్లో సబ్బం హరి కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఆయన తన గళాన్ని విప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios