సీఐడీ విచారణకు హాజరైన టీడీపీ నేత రావిపాటి: సీఐడీ ఆఫీస్ ముందు తెలుగు యువత ఆందోళన
టీడీపీ నేత రావిపాటి సాయి కిరణ్ ఆదివారం నాడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కూడ సాయి కిరణ్ ను సీఐడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
గుంటూరు: సీఐడీ విచారణకు టీడీపీ నేత ఆదివారం నాడు రావిపాటి సాయికృష్ణ హాజరయ్యారు. గతంలోనే రావిపాటి సాయికృష్ణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో సీఎం సతీమణి భారతిపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని సాయికృష్ణపై ఆరోపణలున్నాయి.
రెండు రోజుల క్రితం సాయికిరణ్ ను శుక్రవారం నాడుు సీఐడీ అధికారులు విచారించారు. ఇవాళ కూడా విచారణకు రావాలని నోటీసులుు ఇవ్వడంతో రావిపాటి సాయికిరణ్ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం నాడు ఏడుగంటలపాటు సీఐడీ అధికారులు ఆయనను విచారించారు.సీఎం జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి తనకు సంబంధం లేదని విచారణలో చెప్పినట్టుగా సాయికిరణ్ మీడియాకు చెప్పారు.
ఇవాళ రావిపాటి సాయికిరణ్ సీఐడీ విచారణకు హాజరైన సమయంలోనే తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఉద్దేశ్యపూర్వకంగానే సాయికిరణ్ ను వేధిస్తున్నారని తెలుగు యువత ఆరోపిస్తుంది. తమ పార్టీకి చెందిన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగు యువత నేతలు చెబుతున్నారు.
ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ తమపై వేధింపులకు పాల్పడిందని టీడీపీ ఆరోపించింది. మాజీ మంత్రులను కూడా అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు గుర్తు చేస్తుననారు. చంద్రబాబు,. లోకేష్ సహా పార్టీకి చెందిన కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలపై వైసీపీ దాడులు చేసినా కూడా పోలీసులు కేసులు నమోదు చేయని పరిస్థితులు కూడ నెలకొన్నాయని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.