సస్పెన్స్ కు తెర: డిక్లరేషన్ పత్రం తీసుకున్న రాంగోపాల్ రెడ్డి
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ స్థానం నుండి విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధి రాంగోపాల్ రెడ్డి కలెక్టర్ నుండి డిక్లరేషన్ పత్రం తీసుకున్నారు.
అనంతపురం: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం డిక్లరేషన్ పత్రం తీసుకున్నారు. డిక్లరేషన్ పత్రం కోసం శనివారం నాడు రాత్రి నుండి రాంగోపాల్ రెడ్డి సహా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. డిక్లరేషన్ పత్రం రాంగోపాల్ రెడ్డి కి దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ కు ఇవాళ తెరపడింది.
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ స్థానం నుండి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించినట్టుగా శనివారం నాడు అధికారులు ప్రకటించారు. కానీ ఆయనకు డిక్లరేషన్ పత్రం ఇవ్వలేదు. డిక్లరేషన్ పత్రం కోసం రాంగోపాల్ రెడ్డి ఆందోళనకు దిగారు. శనివారంనాడు కౌంటింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగిన రాంగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయం సాధించినట్టు ప్రకటించిన తర్వాత డిక్లరేషన్ పత్రం ఇవ్వకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్ కేంద్రం బైఠాయించి నిరసనకు దిగారు.
Also read:అనంతలో టెన్షన్: డిక్లరేషన్ పత్రం కోసం కలెక్టరేట్‌కు టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డి
ఈ పరిణామాలను కేంంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు . డిక్లరేషన్ పత్రాలు వెంటనే ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఉదయం కలెక్టరేట్ కు రాంగోపాాల్ రెడ్డి అనుచరులతో కలిసి వచ్చారు. ఇవాళ ఉదయం కలెక్టరేట్ వద్దకు వచ్చిన కలెక్టర్ నాగలక్ష్మి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ పత్రం అందించారు.