అనంతలో టెన్షన్: డిక్లరేషన్ పత్రం కోసం కలెక్టరేట్‌కు టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డి

పశ్చిమ రాయలసీమ పట్టభడ్రుల  ఎమ్మెల్సీ  స్థానంలో  విజయం సాధించిన  టీడీపీ అభ్యర్ధి రాంగోపాల్ రెడ్డి  డిక్లరేషన్ పత్రం తీసుకొనేందుకు  కలెక్టరేట్  కు  చేరుకున్నారు.. 
 

TDP Leader Ramgopal Reddy Reaches To Anantapur Collectorate For Declaration Certificate LNS

అనంతపురం: పశ్చిమ   రాయలసీమ  గ్రాడ్యుయేట్స్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయం సాధించిన  టీడీపీ అభ్యర్ధి  రాంగోపాల్ రెడ్డి  డిక్లరేషన్ పత్రం తీసుకొనేందుకు  ఆదివారం నాడు  ఉదయం అనంతపురం కలెక్టరేట్  కార్యాలయానికి చేరుకున్నారు.  డిక్లరేషన్  పత్రం తీసుకొనేందుకు  అనుచరులతో  కలిసి  ఆయన  కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. 

పశ్చిమ రాయలసీమ పట్టభడ్రుల  ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధి  రాంగోపాల్ రెడ్డి  విజయం సాధించినట్టుగా  శనివారం నాడు  రాత్రి  అధికారులు ప్రకటించారు.  డిక్లరేషన్ పత్రం కూడా  ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని  టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.  కానీ  ఏం జరిగిందో  తెలియదు  కానీ  రాంగోపాల్ రెడ్డికి  డిక్లరేషన్ పత్రం ఇవ్వకుండా నిరాకరించారని  తెలుగు తమ్ముళ్లు  చెబుతున్నారు.  రాంగోపాల్ రెడ్డి సహా  టీడీపీ శ్రేణులు  డిక్లరేషన్ పత్రం కోసం  నిరసనకు దిగారు. పోలీసులు   రాంగోపాల్ రెడ్డిని అరెస్ట్  చేశారు. ఈ పరిణామాలను  టీడీపీ  నేతలు  కేంద్ర ఎన్నికల సంఘం  దృష్టికి తీసుకెళ్లారు.   రాంగోపాల్ రెడ్డికి  ఎందుకు డిక్లరేషన్ పత్రాలు  ఇవ్వలేదని కేంద్ర ఎన్నికల సంఘం  కూడా  ప్రశ్నించింది.  

రాంగోపాల్ రెడ్డికి  వెంటనే  డిక్లరేషన్  పత్రాలు అందించాలని  ఆదేశించింది.  దీంతో  డిక్లరేషన్  పత్రం తీసుకునేందుకు  రాంగోపాల్ రెడ్డ  ఇవాళ  ఉదయం అనంతపురం కలెక్టరేట్  వద్దకు చేరుకున్నారు.  కలెక్టర్  కోసం  రాంగోపాల్ రెడ్డి  ఎదురు  చూస్తున్నారు.  అనంతపురం కలెక్టరేట్  కార్యాలయం  వెలుపల  కూడ  టీడీపీ శ్రేణులు  భారీగా  చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  చోటు  చేసుకోకుండా  ఉండేందుకు  పోలీసులు  భారీగా మోహరించారు. 

also read:ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్రజాతీర్పు వైకాపా సర్కారుకు చెంపపెట్టు లాంటిది : టీడీపీ నేత సోమిరెడ్డి

రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ పత్రం  అందుతుందా లేదా  అనే ఉత్కంఠ  ఆ పార్టీ శ్రేణుల్లో  నెలకొంది.  డిక్లరేషన్ పత్రం  కోసం  అనుచరులతో  రాంగో పాల్ రెడ్డి  కలెక్టరేట్  వద్దకు  చేరుకున్నారు.  దీంతో  అనంత కలెక్టరేట్  వద్ద  టెన్షన్ వాతావరణం  నెలకొంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios