మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబానికి భద్రత తొలగించడం చాలా  నీచమైన పని అని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆయనకు భద్రత ఏనాడు తగ్గించలేదని గుర్తు చేశారు.

ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయాలనే ప్రజావేదికను కూల్చారని ఆరోపించారు. కడప జిల్లాలో వాగులో జగన్ మేనమామ సినిమా థియేటర్లు ఉన్నాయని విమర్శించారు. అలాగే హైదరాబాద్‌లోని జగన్ ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనని చెప్పారు.

అక్రమంగా కట్టారనే కారణంతో ప్రజా వేదికను కూల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావేదికను చంద్రబాబు తనకు కేటాయించమని కోరారన్న కారణంతోనే దానిని కూల్చివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.