Asianet News TeluguAsianet News Telugu

జీవితంపై విరక్తి చెంది..టీడీపీ నేత ఆత్మహత్య

ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెంది మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 

tdp leader PLN kumar commit sucide
Author
Hyderabad, First Published Aug 17, 2018, 12:40 PM IST

జీవితంపై విరక్తి చెంది ఓ టీడీపీ నేత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం డైరెక్టర్‌ పీఎల్‌ఎన్‌ కుమార్‌ (46) గురువారం తన ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత 6 నెలలుగా గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. 

అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాలేదన్నారు. రాత్రి పూట గొంతు నొప్పితో తీవ్ర ఆయాస పడేవారు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెంది మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 

ఈయన మృతికి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి సోదరులు మాజీ సర్పంచ్‌ బీసీ రాజారెడ్డి, బీసీ బాల తిమ్మారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ కోడి నాగరాజుయాదవ్‌, వైసీపీ నాయకులు కాటసాని చంద్రశేఖర్‌ రెడ్డి, కాటసాని తిరుపాల్‌ రెడ్డి, బండి బ్రహ్మానందారెడ్డి తదితరులు పీఎల్‌ఎన్‌ కుమార్‌ భౌతికకాయానికి నివాళి అర్పించారు.
 

చనిపోయి కూడా మరొకరికి చూపును అందించాలనే ఉద్దేశంతో పీఎల్‌ఎన్‌ కుమార్‌ నేత్రదానం చేశారు. కుటుంబ సభ్యులు కర్నూలుకు చెందిన రామాయమ్మ ఇంటర్నేషనల్‌ ఐ బ్యాంకు డాక్టర్లకు నేత్రదానం గురించి ఫోన్‌ ద్వారా తెలియజేశారు. డాక్టర్లు చంద్రశేఖర్‌, హరిహరన్‌లు పీఎల్‌ఎన్‌ కుమార్‌ నేత్రాలను సేకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios