జగన్ ఒక్కడికే అవినీతి కనిపిస్తోంది.. ఇదో రివర్స్ ఇన్వెస్టిగేషన్ : చంద్రబాబు అరెస్ట్‌పై పయ్యావుల కేశవ్
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వైసీపీపై సెటర్లు వేశారు. రివర్స్ టెండరింగ్ మాదిరిగా , ఇది రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటూ కేశవ్ సెటైర్లు వేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ రూ.3,300 కోట్లని.. ఇందులో రూ.371 కోట్లు ఎవరికీ వెళ్లాయో వివరాలు స్పష్టంగా వున్నాయన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ వైసీపీపై సెటర్లు వేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవ్వరికీ కనిపించని అవినీతి జగన్‌కే ఎందుకు కనిపిస్తుందని ప్రశ్నించారు. స్కిల్ స్కాంలో డబ్బు ఎక్కడికి వెళ్లిందన్నది నిరూపణ కాలేదని.. రివర్స్ టెండరింగ్ మాదిరిగా , ఇది రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటూ కేశవ్ సెటైర్లు వేశారు. నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదని.. నిధుల విడుదలలో ప్రేమ్ చంద్రారెడ్డి జాగ్రత్తగా వ్యవహరించారని కేశవ్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం ఏపీ అధికారుల బృందం గుజరాత్‌కు వెళ్లి అధ్యయనం చేసిందని ఆయన వెల్లడించారు. 40 సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చామని కేశవ్ గుర్తుచేశారు. సిమెన్స్ నైపుణ్య శిక్షణను దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం సైతం ప్రశంసించారని ఆయన వెల్లడించారు.
17ఏ కింద చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి వుండాలని కేశవ్ పేర్కొన్నారు. స్కిల్ ప్రాజెక్ట్‌లో అసలు అవినీతే జరగలేదని.. సీఎం, కేబినెట్ కేవలం పాలసీ మేకింగ్ వరకే పరిమితమన్నారు. ఏ పాలసీ అయినా అమలు చేసే బాధ్యత అధికారులదేనని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ రూ.3,300 కోట్లని.. ఇందులో రూ.371 కోట్లు ఎవరికీ వెళ్లాయో వివరాలు స్పష్టంగా వున్నాయన్నారు.
Also Read: చంద్రబాబుకు షాక్: రెండు రోజులు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి
ఇకపోతే.. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై పర్యాటక మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణను టార్గెట్ గా చేసుకుని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో విజిల్ ఊదుతూ బాలకృష్ణ దారుణంగా ప్రవర్తించాడని అన్నారు. సినిమాల్లో మాదిరిగా రైటర్స్ రాసిచ్చే డైలాగులు చెప్పడం... మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం ఇక్కడ పనిచేయవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని గానీ, వైసిపిని గానీ ఏమన్నా అంటే వదిలిపెట్టబోమని బాలకృష్ణను రోజా హెచ్చరించారు.
చంద్రబాబు జైలుకు వెళ్లగానే ఆయన సీటుపై బాలకృష్ణ కన్ను పడిందన్నారు రోజా. ఆ సీటును దక్కించుకోవడం కోసమే అసెంబ్లీలో ఇవాళ చంద్రబాబు సీటు ఎక్కాడన్నారు. నిజంగానే బాబు తుప్పు కాదు నిప్పు అయితే ఆ విషయం చెప్పడానికి కూడా మనసు రాలేదా? అంటూ బాలకృష్ణను ప్రశ్నించారు మంత్రి రోజా.