గుంటూరు: ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. గోదావరి బోటు ప్రమాదం జరిగి 21 రోజులు పూర్తైనా నేటికి బోటు వెలికితీయలేకపోయారని విమర్శించారు. 

సీఎం జగన్ అసమర్థపు పాలన వల్లే బోటు వెలికితీయలేకపోయామని మండిపడ్డారు అనురాధ. జగన్ అసమర్ద పాలనతోనే బోటు వెలికి తీయలేకపోయారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన రోజు సీఎంకు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవని చెప్పుకొచ్చారు. కానీ సీఎం ప్రమాదంపై కనీసం పట్టించుకోలేదన్నారు. సామాన్యుల ప్రాణాలు జగన్ కు లెక్కలేదా అని నిలదీశారు.  

"

సీఎం జగన్ ఓ ఏరియల్ సర్వే చేసి వదిలేశారని విమర్శించారు. జలవనరుల మంత్రి, పర్యాటక మంత్రులు పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు. దసరా కేవలం వైసిపి కార్యకర్తలకే గానీ ఓట్లు వేసిన ప్రజలకు దసరా సంతోషం లేదన్నారు. బోటు ప్రమాదం పై ప్రశ్నించిన దళిత నేతలపై బెదిరింపులకు పాల్పడతారా అంటూ నిలదీశారు పంచుమర్తి అనురాధ.