వివేకానంద రెడ్డి హత్య కేసులలో తమ ప్రమేయం లేదని ప్రమాణం చేయలేక  పారిపోయిన జగన్ మోహన్ రెడ్డి తరఫున మతిలేని మంత్రి కొడాలి నాని వత్తాసు పుచ్చుకోవడం హస్యాస్పదంగా ఉందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

జగన్‌కు సవాల్ విసిరే స్థాయి లోకేశ్‌కు లేదని, ఆయనకు  దమ్ముంటే తనపై  పోటీ చేయాలని నాని ప్రతి సవాల్ విసరడం పలాయన వాదానికి నిదర్శనమన్నారు. రాజకీయ ఊడిగం చేసే నానితో లోకేష్ లాంటి నాయకుడు పోటీ చేయాల్సిన అవసరం లేదని,
నానికి సరదాగా ఉంటే గుడివాడలో రాజీనామా చేసి ఎన్నికలకు అవకాశం కల్పిస్తే సాధారణ కార్యకర్తను పోటీ పెట్టి ఓడించడానికి టిడిపి సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. 

కొడాలికి సిగ్గు ఉంటే ఈ నెల 14 న తిరుపతి వస్తున్న జగన్ వద్ద ప్రమాణం చేయించాలి. కనీసం జగన్ భార్య లేదా కుటుంబ సభ్యుల చేతయినా ప్రమాణం చేయించ గలరేమో చెప్పాలని డిమాండ్ చేశారు. వారెవరూ ముందుకు రాకుంటే నాని అయినా ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.