తన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పర్యటనను పోలీసులు అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి వెనక్కితగ్గారని ఆయన దుయ్యబట్టారు. 

ఇటీవ‌ల రాజ‌కీయ గొడ‌వ‌ల నేప‌థ్యంలో మ‌రణించిన టీడీపీ (tdp) కార్య‌క‌ర్త జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ (nara lokesh) గురువారం ప‌ల్నాడు జిల్లా (palnadu district) పిడుగురాళ్ల‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు దారి పొడ‌వునా పార్టీ శ్రేణుల నుంచి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అయితే త‌న ప‌ర్య‌ట‌న‌ను పోలీసులు అడ్డుకునేందుకు య‌త్నించార‌ని నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్ల‌ను పోస్ట్ చేశారు.

‘‘ కుతంత్రాలతో నా పల్నాడు పర్యటనని పోలీసులు అడ్డుకోవాలనుకున్నారు. అడుగడుగునా వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి వెనక్కితగ్గారు. పిడుగురాళ్ల పట్టణంలో యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా నేతలు, కార్యకర్తలు నాపై కురిపించిన అభిమానం ఎప్పటికీ గుర్తుండి పోతుంది’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. 

ALso REad:ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రని చెప్పుకుంటున్న జగన్..: నారా లోకేష్ సంచలనం

అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా టిడిపి ప్రభుత్వం అధికారంలో వుండగా ఏపీలో పెట్టుబడికి సిద్దమైన కంపనీలను తామే తీసుకువచ్చినట్లుగా వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భగా సోషల్ మీడియాలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

'జగన్ రెడ్డి ది సిగ్గు లేని జన్మ... ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ జగన్ రెడ్డి తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు గారు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు'' అంటూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇక ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు చేపట్టిన దావోస్ పర్యటనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ''సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా ఉంది జగ్గడి దావోస్ పర్యటన. సింగడు అద్దంకి ఎందుకో పోయాడో ఎందుకు వచ్చాడో తెలీదు అనే మన తెలుగు సామెతను జగ్గడు మళ్లీ గుర్తుకు తెచ్చారు. జగ్గడు అసలు దావోస్ ఎందుకు పోయారో... ఏమి తెచ్చారో ఎవరికీ తెలీదు. అసలే అంతంత మాత్రం గా ఉన్న ఆర్థిక పరిస్థితికి స్పెషల్ ఫ్లైట్ విలాసాల ఛార్జీల మోత అదనపు భారం తప్ప...రాష్ట్రానికి పైసా లాభం లేదు'' అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

Scroll to load tweet…