జగన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ని ఆత్మహత్యలప్రదేశ్‌గా మార్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. బుధవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... వైసీపీ పాలనలో సామాన్యులకు రక్షణ లేకుండా పోతోందన్నారు.

వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని, వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్ధితులు కల్పిస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు.

చిలకలూరిపేట నియోజకవర్గం సాతులూరులో.. ఒంటరి మహిళ హోటల్‌ను కబ్జా చేసేందుకు వైసీపీ నేత యత్నించారని, దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానందని అన్నారు.

హోటల్ కబ్జాకు యత్నించిన వైసీపీ నేతను కఠినంగా శిక్షించాలని ఒంటరి మహిళకు న్యాయం చేయాలని నారా లోకేష్‌ డిమాండ్ చేశారు.

‘‘మాలతి గారు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. జగన్ రెడ్డి గారు ఇదేనా మహిళలకు మీరిచ్చే అభయం?మాలతి గారిని వేధించిన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలన్నారు.