Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీల ఖాతాలో డబ్బులు మాయం... ఏకంగా రూ.965 కోట్లు: నారా లోకేష్ సీరియస్

ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాల అభివృద్ది కోసం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు ఇచ్చిన నిధులను అధికార వైసిపి ప్రభుత్వం ఇతర అవసరాలకోసం మళ్లించడం దారుణమని నారా లోకేష్ మండిపడ్డారు. 

TDP Leader Nara Lokesh Serious on CM YS Jagan
Author
Amaravati, First Published Nov 23, 2021, 1:23 PM IST

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మాయమయ్యాయి. కొన్ని పంచాయితీల ఖాతాల్లో నిధులు తగ్గిపోగా, మరికొన్ని పంచాయితీల ఖాతాల్లో అయితే జీరో బ్యాలెన్స్ చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే పాలనా అవసరాల కోసం ఈ నిధులను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. 
 
''వ్యవస్థల విధ్వంసానికి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న cm jagan reddy ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని nara lokesh అన్నారు. 

''గతంలో 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేసారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత ఖాతాల్లో సొమ్ము జీరో అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో వెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు.

read more  కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడవు, నీకు పార్టీ పగ్గాలు కావాలా?... ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన లోకేష్ ఫ్యాన్స్!

ఇక ఇదే విషయంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు, TDP నాయకులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ కూడా స్పందించారు. గతంలోనూ ఇలాగే పాలకవర్గాల అనుమతి లేకుండానే 14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీల పేరుతో మళ్లించారని గుర్తుచేసారు. ఇప్పుడు దాదాపు రూ.3 వేల కోట్లు వెనక్కి తీసుకున్నట్లు అంచనా వేస్తున్నట్లు yvb rajendra prasad పేర్కొన్నారు. 

గ్రామాల అభివృద్ది కోసం ఆర్థిక సంఘం పంచాయితీలకు కేటాయించిన నిధులు వెనక్కి తీసుకోవడం పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పంచాయితీ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తామని రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. 

ఇదిలావుంటే ఇటీవల వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై స్పందిస్తూ సీఎం జగన్ పై లోకేష్ విరుచుకుపడ్డారు. సొంత కడప జిల్లాలో 12 మంది వర్షాలు, వరదల ధాటికి  మరణించినా... 30 మంది గల్లంతైనా పట్టించుకోని ముఖ్యమంత్రిని ఏమనాలి? అంటూ మండిపడ్డారు. 

read more  హెచ్చరించినా పట్టించుకోలేదు... తిరుపతి జలదిగ్భందం ప్రభుత్వ వైఫల్యమే: నారా లోకేష్ సీరియస్

ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని... నేలకు దిగితేనే కదా జనం వరద కష్టాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్షాలు, వరదలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి శాడిస్టిక్ ఆనందం పొందుతున్నారని లోకేష్ మండిపడ్డారు.  

Follow Us:
Download App:
  • android
  • ios