తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గురువారం వరుస ట్వీట్ల ద్వారా విరుచుకుపడ్డారు.

‘‘ వైకాపా ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. టిడిపి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో కార్యకర్తలు, ఇంటి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను’’

‘‘ చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడి ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలి లేదా వైకాపా రౌడీలకు ఖచ్చితంగా మేమే బుద్ధి చెబుతాం. నాయకుల ఇళ్లపై దాడి చేసి,కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్న వారి తల పొగరు అణిచివేస్తాం. టిడిపి అధికారంలోకి రావడం అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయం’’