పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించండి: మంత్రి బొత్సకు లోకేశ్ లేఖ
పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు
పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. కరోనా నివారణకు జరుగుతున్న పోరాటంలో పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
కఠినమైన సమయాల్లో కూడా వారు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తిస్తున్నారని, పారిశుద్ధ్య కార్యికుడికి వ్యక్తిగత రక్షణ కిట్లను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని లోకేశ్ ఆరోపించారు.
Also Read:కిట్ల కొరత, బెజవాడలో నిలిచిపోయిన కరోనా నిర్ధారణ పరీక్షలు: ఆందోళనలో ప్రజలు
ఇప్పటికీ వారు తమ విధులకు హాజరవుతున్నారని, సీఆర్‌డీఏ గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు గత 4-5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం ఆవేదన కలిగించే అంశమన్నారు.
పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వానికి అనేక అభ్యర్ధలను చేసినా పట్టించుకోలేదని, సంక్షోభ సమయంలోనూ సమ్మెలో కూర్చోవడం వారి చివరి అస్త్రంగా మారిందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
Also Read:ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన: వైఎస్ జగన్ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి
పెనుమాక గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసనను ఈ లేఖకు జత చేస్తున్నానని, వారికి తక్షణమే జీతాలు చెల్లించేలా చూడటం కర్తవ్యమని లోకేశ్ స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ ప్రాంతంలోని పారిశుద్ధ్య కార్మికుల బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.