Asianet News TeluguAsianet News Telugu

Yuvagalam Padayatra : నారా లోకేష్ కు స్వల్ప గాయం

మరో రెండురోజుల్లో యువగళం పాదయాత్ర ముగుస్తుందనగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వల్పంగా గాయపడ్డారు.

TDP Leader Nara Lokesh injured in Yuvagalam Padayatra AKP
Author
First Published Dec 18, 2023, 7:07 AM IST | Last Updated Dec 18, 2023, 7:12 AM IST

విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన యువగళం పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోంది. ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ లోకేష్ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో పరవాడ మండలంలో పాదయాత్ర సాగిస్తూ ప్రజలతో కరచాలనం చేస్తుండగా లోకేష్ చేయికి గాయమయ్యింది. అరచేయి వాచి నొప్పి బాధిస్తున్నప్పటికి లోకేష్ పాదయాత్రను కొనసాగించారు.

పాదయాత్ర కొనసాగిస్తూనే వాచిన చేయిపై ఐస్ ప్యాక్ పెట్టుకోవడం కనిపించింది. అలాగే ప్రజలకు కుడిచేతితో కాకుండా ఎడమచేతితో అభివాదం చేస్తూ కనిపించారు. ఇలా గాయం బాధిస్తున్నప్పటికీ లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. 

ఇదిలావుంటే మరో రెండురోజుల్లో లోకేష్ పాదయాత్ర ముగియనుంది. డిసెంబర్ 22న విజయనగరంలో భారీ బహిరంగ సభతో లోకేష్ పాదయాత్ర ముగుస్తుంది. ఈ ముగింపు సభకోసం తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలంతా ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ వాహనాలను టిడిపి సిద్దం చేస్తోంది.  

Also Read  జనసేన - టీడీపీ పొత్తు : రూటు మార్చిన చంద్రబాబు .. స్వయంగా పవన్ నివాసానికి , బాబు గారి వ్యూహమేంటో..?

ఈ ఏడాది ఆరంభంలో అంటే జనవరి 27, 2023 లో లోకేష్ పాదయాత్ర ప్రారంభమయ్యింది. తన తండ్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం నుండి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. ఇలా ప్రారంభమైన పాదయాత్ర రాయలసీమలో నిర్విరామంగా సాగింది. కానీ కోస్తాంద్ర లో పాదయాత్ర కొనసాగుతుండగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయ్యారు. దీంతో లోకేష్ యువగళం పాదయాత్రకు కొద్దిరోజులు బ్రేక్ పడింది. తండ్రికి బెయిల్ వచ్చి జైలునుండి బయటకు రావడంతో ఎక్కడ పాదయాత్ర ఆగిందో అక్కడినుండే తిరిగి ప్రారంభించారు లోకేష్. 

ముందుగా కుప్పం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలన్నది లోకేష్ ప్లాన్. కానీ మధ్యలో పాదయాత్రకు ఆటంకాలు కలగడం... ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో విశాఖలోనే పాదయాత్రను ముగించాల్సి వస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios