పోలీసులపై వైకాపా నేతల దాడిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. తన్నులు తిని వైకాపా వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి అంటూ మండి పడ్డారు. 

పోలీసులపై వైకాపా నేతల దాడిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. 
తన్నులు తిని వైకాపా వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండి అంటూ మండి పడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడాని కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా గూండాల నుండి సాటి పోలీసుల్ని కాపాడుకోలేని వాళ్ళు వాస్తవాలు తెలిసినా కళ్ళకి గంతలు కట్టుకొని ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు.

పోలీసులు గాయపడ్డారు అని మీరే అంటున్నారు. మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారు? ఆయనకి ఆయనే గాయపర్చుకున్నాడా? ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు? బాడీ వార్న్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయం అయ్యాయి? అంటూ ప్రశ్నించారు. 

గాయపడిన పోలీసుకి అయింట్మెంట్ రాయాల్సింది పోయి జగన్ రెడ్డి కి అయింట్మెంట్ పుయ్యడం బాధాకరం అంటూ ఎద్దేవా చేశారు. వైకాపా గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైకాపా నాయకులు పోలీసుల పై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.