Asianet News TeluguAsianet News Telugu

పెగాసస్‌పై దేనికైనా సిద్ధం.. వైసీపీ ప్రభుత్వానికి నారా లోకేష్ సవాలు..

ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ పెగాసస్ ‌విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు.  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు. 

TDP leader nara lokesh Challenge to YSRCP Govt Over Pegasus
Author
Amaravati, First Published Mar 21, 2022, 5:03 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ పెగాసస్ ‌విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. పెగాసస్‌పై ఏ విచారణకైనా తాము సిద్దంగా ఉన్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాలపైనా విచారణ చేయగలరా అని వైసీపీ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో పెగాసర్ గురించి మాట్లాడారా..? లేదా..? అనే స్పష్టత లేదని లోకేష్ పేర్కొన్నారు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ పేర్కొన్నారు.

ఇక, Pegasusపై హౌస్ కమిటీతో విచారణ జరిపిస్తామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni Sitaram సోమవారం శాసనసభలో ప్రకటించారు. ఈ విషయమై ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా ఇతర సభ్యులు కోరిన మీదట హౌస్ కమిటీ విచారణకు స్పీకర్ ఆదేశించారు. పెగాసెస్ అంశంపై ఏపీ అసెంబ్లీలో  సోమవారం నాడు చర్చ జరిగింది.  ఈ చర్చలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranathపాల్గొన్నారు.Chandrababu Naidu పెగాసెస్ సాఫ్ట్ వేర్  కొనుగోలు చేశారని బెంగాల్ సీఎం Mamata Benarjee అసెంబ్లీలోనే ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.  కచ్చితమైన సమాచారం ఉండి ఉంటేనే మమత బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయన గుర్తు చేశారు.

పెగాసెస్ వంటి స్పైవేర్ తో వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ సాఫ్ట్ వేర్ తో వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకొనే అవకాశం కూడా ఉందన్నారు. ఇలాంటి అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్ గానే చేస్తారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇది ప్రమాదమే కాదు అనైతికం కూడా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇలాంటి ప్రమాదకర  సాఫ్ట్‌వేర్ ను చంద్రబాబు కొన్నారంటే ఎంత దుర్మార్గమన్నారు.పెగాసెస్‌తో ఏమేమీ చేశారో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ఇది రాష్ట్రానిదే కాదు దేశ భద్రతకు సంబంధించిన అంశమని మంత్రి బుగ్గన అభిప్రాయపడ్డారు. మిస్డ్ కాల్ ద్వారా కూడా ఈ సాఫ్ట్ వేర్ ను ఫోన్ లో చొప్పించ  ప్రమాదకర సాఫ్ట్ వేర్ ఇది అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. దొంగతనం అందరికీ తెలిసేలా ఎలా చేస్తారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios