Asianet News TeluguAsianet News Telugu

పీలేరు పరిధిలో రూ.400 కోట్ల అవినీతి.. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి


పీలేరు పరిధిలో రూ.400 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అక్రమంగా భూములు స్వాధీనం చేసుకుని లే అవుట్లు వేస్తున్నారు.  అక్రమాలపై విచారణ జరిపి స్థానిక ఎంపీ, సీఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

tdp leader nallari kishore kumar reddy on peleru lands - bsb
Author
Hyderabad, First Published Jul 3, 2021, 1:25 PM IST

పీలేరు పరిధిలో రూ.400 కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అక్రమంగా భూములు స్వాధీనం చేసుకుని లే అవుట్లు వేస్తున్నారు.  అక్రమాలపై విచారణ జరిపి స్థానిక ఎంపీ, సీఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకర్గ పరిధిలోని దుడ్డుపల్లి, యర్రగుంట్లపల్లి, బోడిమంట్లవారిపల్లి, గుడ్రేవుపల్లి వంతి తదితర గ్రామాల్లో  హైదరాబాద్-చెన్నై రహదారికి ఇరువైపులా, మదనపల్లి – తిరుపతి జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు ఉన్న భూముల్ని సుమారు మా కుటుంబం, టీడీపీ కాపాడుకుంటూ వచ్చింది. 
పైన చెప్పిన గ్రామాల పరిధిలో రూ.400 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇందులో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే ప్రోద్భలంతో వైసీపీ నాయకులు, అనుచరులు భూకబ్జాలకు పాల్పడ్డారు. 400 కోట్లు విలువ చేసే భూముల కబ్జాను ఆధారాలతో సహా సేకరించాం. పీలేరులో వందల కోట్లు విలువ చేసే భూమిల్ని ఈ రెండేళ్లలో ఏ విధంగా ఆక్రమించుకున్నారో ప్రజలకు వివరిస్తాం. 

అధికార పార్టీ నాయకులు చెప్తున్న నీతివంతమైన పాలనపై ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులతో న్యాయ విచారణ చేయాలి. కింద స్థాయిలో తప్పులు చేయాలంటే గతంలో సీఎంలుగా చేసిన విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య అంటే భయం వుండేది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.  సీఎం జగన్ ప్రజాప్రతినిధులను రోడ్లపైన వదిలారు. చిత్తూరు జిల్లాలో వేల కోట్లు విలువ చేసే భూముల్ని దోచుకున్నారు. ఆధారాలన్నీ త్వరలో చంద్రబాబుకు, మీడియాకు అందిస్తాం. సబ్ కలెక్టర్ కు చెప్తే భూముల్ని ఆమె సందర్శించారు. కానీ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. 

అక్రమాలకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పినప్పటికీ ఇంకా ఆ పనులేవీ జరగలేదు. పీలేరు పట్టణ గ్రామానికి సంబంధించి దాదాపు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమనకు గురైంది. దాని విలువ సుమారు రూ.30 నుండి రూ.40 కోట్లు విలువ చేస్తుంది. లే అవుట్ అప్లోడ్ లేదు, అనుమతి లేకుండా విద్యుత్ సిబ్బంది లైన్లు కూడా బిగించారు. సర్వే నంబర్ 204లో 40 కోట్ల విలువ వుంటుంది. రైతులకు ట్రాన్ఫార్మర్లు ఇవ్వడం లేదు.. కానీ అక్రమ లేఅవుట్లకు మాత్రం ఇస్తున్నారు.

దొడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లో  సబ్ కలెక్టర్ పర్యటించి బోర్డు పెట్టకండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని 7 నెలల క్రితం చెప్పారు.  దొడ్డిపల్లిలోని 1954 సర్వే నంబర్ లో 5 ఎకరాల భూమి ఆక్రమనకు గురైంది. దీని విలువ రూ.20 నుండి రూ.30 కోట్లు వుంటుంది. బోడుమల్లవారి పల్లిలో 50 కోట్లు విలువ చేసే భూమిని లే అవుట్లు వేసి అమ్ముకుంటున్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టాం. పీలేరు దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గ్రౌండ్ లెవల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. 

పీలేరు మేజర్ పంచాయతీలోని సర్వే నంబర్ 1 లో రూ.25 కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకున్నారు. ముస్లింలకు స్మశాన వాటికకు 2 ఎకరాలు ఇస్తే దాంట్లో కూడా లే అవుట్లు వేశారు. దాని విలువ కూడా రూ.20 కోట్లు వుంటుంది. యర్రగుంట్లపల్లి, అగ్రహారంలో సర్వే నంబర్ 773, 785, 659, 660లో ప్రభుత్వ భూమి ఎకరా మార్కెట్ ధర రూ.50 కోట్లు వుంటోంది. ఇందులో అక్రమ లేఅవుట్లు వేసి ప్రజలకు అమ్ముతున్నారు. ముడివేముల గ్రామానికి సంబంధించి 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో తుడా అనుమతి లేకుండా లేఅవుట్లు వేశారు. తమ భూములను ఏపీవో నందకుమార్ రెడ్డి ఆక్రమించుకున్నారని మహిళలు ఎంపీకి ఫిర్యాదు చేశారు.  

అక్రమాలు బయటపెడతామని తెలుసుకుని అధికారులను నిందించినట్లు ఎంపీ నాటకాలాడారు. మా పార్టీ వ్యక్తులు తప్పులు చేస్తే మా భూములు స్వాధీనం చేసుకోండి. భూ అక్రమనకు గురైన సర్వే నంబర్లతో సహా ఇస్తున్నాం. ఎంపీ, మంత్రులు పాత్ర వుంది కాబట్టే భూముల్ని స్వాధీనం చేసుకోలేపోతున్నారు. సాక్షి పత్రికలో తప్పుడు రాతలు రాశారు. కొంతమందిపై ఎఫ్ఐఆర్ పెట్టి బెదిరించి వైసీపీ చేర్చుకున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అవినీతి పాతుకుపోయింది. చంద్రబాబు ఏనాడూ భూ అక్రమాలను ప్రోత్సహించలేదు. తప్పు చేయాలంటే భయపడ్డారు. 

కానీ వైసీపీ వచ్చాక ఇష్టానుసారంగా భూఅక్రమాలు జరుగుతున్నాయి.  మీడయా వాళ్లు కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. లే అవుట్లు వేసి వైసీపీ వాళ్లు అమ్మే భూముల్ని కొనొద్దు. మేము అధికారంలోకి రాగానే విచారణ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తాం. చర్యలు తీసుకునేందుకు టీడీపీ హయాంలో అధికారులకు అధికారాలు వుండేవి.  న్యాయ స్థానంలో లేఅవుట్లు చెల్లవు అనే తీర్పు వస్తుంది. చిత్తశుద్ధి వుంటే ఎంపీ, ముఖ్యమంత్రి న్యాయవిచారణ చేయించాలి. ఎవరు తప్పు చేసినా శిక్షించండి. సాక్షి పత్రికను అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా రాయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios