విశాఖ జిల్లా కశింకోట మండలంలో చోటు చేసుకున్న స్పిరిట్ మరణాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కె.ఎస్.జవహర్ ఆరోపించారు. 

విశాఖ జిల్లా కశింకోట మండలంలో చోటు చేసుకున్న స్పిరిట్ మరణాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కె.ఎస్.జవహర్
ఆరోపించారు. రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను 75శాతం మేర పెంచారని... ఇలా వైసిపి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. 

''మద్యం ధరలు ఇష్టానుసారంగా పెంచడమే ఈ మరణాలకు కారణం. పేదలు తాగే చీప్ లిక్కర్ మొన్నటి వరకు రూ.50 ఉంటే ప్రస్తుతం రూ.150 నుండి రూ.200కి పెంచి పేదల చావులకు కారణమయ్యారు. దశలవారీ మద్యపాన నిషేధం అని ప్రకటించి.. దశల వారీగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు'' అని ఆరోపించారు. 

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

''లాక్ డౌన్ సమయంలోనూ మద్యం దుకాణాలు తెరిపించి ప్రజలకు కరోనా వ్యాపింపజేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మద్యం చిచ్చు మొదలు పెట్టారు. రాష్ట్రంలో అత్యాచారాలు, అకృత్యాలు పెరిగేందుకు కారణమయ్యారు'' అన్నారు. 

''ప్రభుత్వ ఆదాయం కోసం మధ్యం ధరల్ని పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. జే ట్యాక్స్ కోసం పేద మధ్య తరగతి ప్రజలు నాటుసారా, గుడుంబా, స్పిరిట్ వంటి వాటికి బానిసల్ని చేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. కశింకోటలో స్పిరిట్ తాగడం వలన పోయిన ప్రాణాలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. జే ట్యాక్స్ కోసం జగన్ రెడ్డి కక్కుర్తికి బలైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి'' అని జవహర్
 డిమాండ్ చేశారు.