కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఏ కొండూరు మండల ప్రజలకు ధైర్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ ను కోరారు టిడిపి నేత కేశినేని చిన్ని.
హైదరాబాద్ : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో తెలుగుదేశం పార్టీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వీరిమధ్య చర్చ జరిగింది. అలాగే కేశినేని ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి పవన్ కు చిన్ని వివరించారు. దీంతో చిన్నిని పవన్ అభినందించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సమయంలో జనసేనాని పవన్ ఆయను మద్దతుగా నిలిచారు. అలాగే అధికార వైసిపిని గద్దె దించడానికి టిడిపి, జనసేన కలిసి పోటీచేయాలని నిర్ణయించారు. ఇలా ఇబ్బందుల్లో వున్న సమయంలో చంద్రబాబుకు, టిడిపికి మద్దతుగా నిలిచినందుకు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు కేశినేని చిన్ని.
ఇక కేశినేని ఫౌండేషన్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన కార్యక్రమాల గురించి చిన్ని వివరించారు. మీరు ఉద్దానం కిడ్నీ బాధితులకు బాసటగా నిలవడం తమకెంతో స్పూర్తినిచ్చిందని... దీంతో ఏ కొండూరు మండలంలోని కిడ్నీ బాధితులను ఆదుకున్నామని తెలిపారు. అధినేత చంద్రబాబు ఆదేశాలు, మీ స్పూర్తితోనే సేవా కార్యాక్రమాలు చేపడుతున్నట్లు పవన్ కు తెలిపార కేశినేని చిన్ని.
Read More వసంత కృష్ణప్రసాద్ రాజీనామా ప్రచారం... స్వయంగా వైసిపి ఎమ్మెల్యేనే క్లారిటీ
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఏ కొండూరు మండల ప్రజానీకానికి ధైర్యం ఇవ్వాలని పవన్ ను కోరారు చిన్ని. ఇందుకోసం విజయవాడకు రావాల్సిందిగా పవన్ ను ఆహ్వానించానని... ఇందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు కేశినేని చిన్ని తెలిపారు. త్వరలోనే ఏ కొండూరు మండల పరిధిలోని తండాల్లో పర్యటించి కిడ్నీ బాధితులకు పవన్ భరోసా ఇస్తారని కేశినేని చిన్ని ప్రకటించారు.
