Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఆ వీడియోని ఫ్యామిలీతో చూడగలరా.. మాధవ్‌పై చర్యలు తీసుకోలేదో ‘‘చీ, థూ’’ అని ఉమ్మేస్తారు : కావలి గ్రీష్మ

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కావలి గ్రీష్మ. జగన్ శాడిస్టు కాబట్టి గోరంట్ల లాంటి న్యూడిస్టులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

tdp leader kavali greeshma serious comments on ysrcp mp gorantla madhav video call
Author
Amaravati, First Published Aug 7, 2022, 6:19 PM IST

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి కావలి గ్రీష్మ. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ శాడిస్టు కాబట్టి గోరంట్ల లాంటి న్యూడిస్టులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర మహిళలు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని పూజిద్దామనుకుంటే అష్ట దరిద్రపు వీడియో దర్శనమిచ్చిందని గ్రీష్మ వ్యాఖ్యానించారు.  75వ స్వాతంత్ర్య దినోత్సవం వస్తోంది సంతోషిద్దామనుకుంటే గోరంట్ల గబ్బు పట్టించాడని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలుగువారు అని దేశంలో ఎవర్ని టచ్ చేసినా పోర్న్ స్టార్ గోరంట్ల మాధవ్ అనే వస్తోందని గ్రీష్మ సెటైర్లు వేశారు.  గోరంట్ల తప్పు చేశాడు అని వైసీపీలో ఏ ఒక్కరూ చెప్పడం లేదని ఆమె మండిపడ్డారు. 

తుమ్మినా, దగ్గినా ట్వీట్లు పెట్టే విజయసాయి.. గోరంట్ల విషయంలో ఏ ట్వీట్ పెట్టడంలేదే అని గ్రీష్మ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఆడవారికి మర్యాదివ్వరని స్పష్టంగా అర్థమైందని కావలి ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు మూడేళ్లుగా బాగా డబ్బు సంపాదించడంతో మదమెక్కి ఉన్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  గోరంట్ల మాధవ్ వీడియో జగన్ తన కుటుంబసభ్యులతో చూడగలరా అని గ్రీష్మ ప్రశ్నించారు.  హోం మినిష్టర్.. గోరంట్ల వీడియో చూసి అజ్ఞాతంలోకి వెళ్లారా అని ఆమె నిలదీశారు.  గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకపోతే వైసీపీపై ‘ఛీ’, ‘థూ’ అని ఉమ్మేస్తారంటూ కావలి గ్రీష్మ జోస్యం చెప్పారు. 

ALso Read:గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో : ‘‘ మీ వాళ్లు చేయలేదా ’’ .. కుప్పంలో టీడీపీ నిరసనను అడ్డుకున్న సీఐ

మరోవైపు.. ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (varla ramaiah) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ ముఖ్యమంత్రి గారూ! ఎంపీ మాధవ్ బూతు పురాణo ఘటనలో ఆ బూతు వీడియో ను ఫోరెన్సిక్ లాబ్ కు పంపామని సజ్జల చెప్తున్నారు. అయితే, ఏ లాబ్ కు పంపారు, ఏ పొలీసు స్టేషన్ నుండి ఏ అధికారి పంపారు, ఏఏ సెక్షన్ లతో కేసు నమోదు చేసారు? అసలు ఆ బూతు వీడియో ఫోరెన్సిక్ లాబ్ కు చేరిందా,లేదా? చేరితే, ఎప్పుడు? ’’ అంటూ వర్ల రామయ్య ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఇకపోతే.. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. ఆదవారం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. ఎక్కడ ఏం జరిగినా.. రోజా ఎక్కడ అని అడుగుతున్నారంటే.. టీడీపీ, జనసేనలకు తన మీద ఎంత ప్రేమ ఉందోనని వ్యంగ్యస్త్రాలు సంధించారు. తనపై చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇబ్బంది కలిగిస్తే సీఎం జగన్ వదిలిపెట్టరని చెప్పారు. తమది మహిళ పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు. మహిళల అభివృద్ది కోసం పని చేసే ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు.  

వీడియో నిజమో, కాదో తెలసుకోకుండా టీడీపీ విమర్శలు చేయడం తగదని అన్నారు. సీఎం జగన్ విచారణకు ఆదేశించారని చెప్పారు. టీడీపీ హయాంలో మహిళపై లెక్కలేనని దాడులు జరిగిన ఒక్క కేసు కూడా నమోదుచేయలేదని విమర్శించారు. నారాయణ స్కూల్స్‌లో ఆడపిల్లలు చనిపోతే ఒక్క కేసైనా పెట్టారా? అని ప్రశ్నించారు. మహిళలకు ఇబ్బంది  కలిగించే  విధంగా ఎవరూ ఏ తప్పు చేసినా సీఎం జగన్ కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. 

ఇక, గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఏపీ మహిళా కమీషన్.. డీజీపీకి లేఖ రాసింది. ఇందుకు సంబంధించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డీజీపీని కోరింది. ఈ ఘటనలో త్వరగా నిజాలు నిగ్గు తేల్చాలని ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios