అమరావతి:  మద్యపాన నిషేదం  పేరుతో మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ మద్య నిషేదం అమలుచేయకపోగా రాష్ర్టంలో మద్యం ఏరులై పారిస్తూ మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ ఏపీ చీఫ్ కళా వెంకట్రావు విమర్శించారు.

జలగ రక్తం తాగినట్లు  మద్యం రేట్లు 90 శాతం పెంచి జగన్ ప్రజల రక్తం త్రాగుతున్నారన్నారు. సామాన్యుడి దినసరి కూలీ మెత్తం తాగుడికే ఖర్చయ్యేంతలా మద్యం రేట్లు పెంచారన్నారు.

  మద్యానికి అలవాటుపడిన వారు మద్యం మానలేక, పెరిగిన రేట్లతో మద్యం కొనలేక స్పిరిట్  త్రాగి 7 మంది చనిపోయారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ త్రాగి మరో 9 మంది, కర్నూలు జిల్లాలో ముగ్గురు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరికొంత మంది నాటుసారా, కల్తీ మద్యం త్రాగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

మృతుల కుటుంబాలకు దిక్కెవరు? ఇవన్నీ ప్రభుత్వ హత్యలే,  మీ ధనదహానికి ప్రజలను బలిచేస్తారా? చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 

మద్యం ధరలు పెంచి ప్రభుత్వం పేదల ప్రాణాలు తీస్తోంది.  ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కన్నా మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యమా? అని ఆయన ప్రశ్నించారు.

రాత్రి 9 వరకు అనుమతులిచ్చి విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారురన్నారు.లాక్ డౌన్ లో గుడులు, బడులు తెరవకుండానే మద్యం దుకాణాలు తెరవటం సిగ్గుచేటని చెప్పారు.

చంద్రబాబు పాలనలో పంటపొలాల్లో పట్టిసీమ జలాలు పారితే, జగన్ పాలనలో పట్టణాల నుంచి పల్లెవరకు మద్యం ఏరులై పారుతోంది.  రాష్ర్టంలో వైసీపీ నేతలే మద్యం మాపియాను పెంచి పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 కమీషన్లు ఇవ్వలేదని నాణ్యమైన బ్రాండ్లు ఉత్పత్తి చేసే డిస్టరీలకు ఆర్డర్లు నిలిపివేసి  కేసుకు 10 శాతం చొప్పున కమీషన్లు తీసుకుని నకిలీ బ్రాండ్లకు అనుమతిలిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు.

గతేడాది ఎక్సైజ్ రాబడి రూ.6,220 కోట్ల నుండి రూ.6,536 కోట్లకు పెరిగింది, 90 శాతం ధరల పెంచి త్రాగేవారిపై  రూ.9 వేల కోట్లు  భారం మోపారు... ముఖ్యమంత్రి జగన్ అసమర్ధత, అనుభరాహిత్యం వల్ల రాష్ర్టంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. 

జే టాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి, నాణ్యతలేని మద్యం నిషేధించాలి,గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతున్న నాటుసారా విక్రయాలు పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.