తాడిపత్రి: జగన్ పాలనే తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీని గెలిపిస్తోందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్ధుల తరపున జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం నాడు ప్రచారం నిర్వహించారు.  ఈ మున్సిపాలిటీ చైర్మెన్ అభ్యర్ధిగా  స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడిని వైసీపీ బరిలోకి దించింది.

టీడీపీ కూడ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. రెండేళ్లలో జగన్ సర్కార్ చేసిన పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పారు. 

తమ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే మున్సిపాలిటీని అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు.  ఇప్పటికే ఈ మున్సిపాలిటీలో రెండు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గెలుపుపై ఇరువర్గాలు ధీమాతో ఉన్నాయి. తాడిపత్రిని తమ సత్తాను చాటేందుకు టీడీపీ సర్వశక్తులను ఒడ్డుతోంది.

గతంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ గా ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత ఇదే స్థానం నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే.