Mangalagiri: ఆర్కే డ్రామాలు.. అందుకే షర్మిల దగ్గరికి వెళ్లి వచ్చారు: మాజీ మంత్రి జవహర్

ఆర్కే డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు జవహర్ ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే షర్మిల వద్దకు వెళ్లారని అన్నారు. వైసీపీలోకి రావడం మరో డ్రామా అని మండిపడ్డారు. ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
 

tdp leader jawahar slams mangalagiri mla alla ramakrishnareddy over his rejoining YSR Congress Party kms

RK: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వైఎస్ షర్మిల తన వైఎస్సార్టీపీని ఏపీ కాంగ్రెస్‌లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆర్కే కూడా హస్తం గూటికి వెళ్లారు. తాజాగా, మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ పరిణామంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు జవహర్ స్పందిస్తూ ఆర్కేపై మండిపడ్డారు. ఆర్కే డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఆ డ్రామాల్లో భాగంగానే ఆయన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వద్దకు వెళ్లారని అని పేర్కొన్నారు. ఇక వైసీపీలోకి మళ్లీ రావడం మరో డ్రామా అని విమర్శించారు.

జగన్ అన్ని విషయంలో తికమకపడుతున్నారని, టికెట్ల విషయంలోనూ తికమక పడుతున్నారని జవహర్ ఆరోపించారు. ఇప్పటికి జగన్‌కే టికెట్లు ఎవరికి ఇవ్వాలా? అనే క్లారిటీ లేదని అన్నారు. ఇక సజ్జల ఏమైనా షాడో ముఖ్యమంత్రా? అని ఫైర్ అయ్యారు. చర్చకు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ చేసి మూడు రోజులు గడుస్తున్నా.. సీఎం జగన్ ఇంకా స్పందించలేదని అన్నారు. చర్చకు రాకుండా కేవలం అసత్యాలు ప్రచారం చేయడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

Also Read: Mangalagiri: వైసీపీలోకి ఆర్కే.. మంగళగిరిలో లోకేశ్ మళ్లీ ఓడిపోతాడు

జగనే అసలైన పెత్తందారుడని జవహర్ విమర్శించారు. పేదల సంపద దోచుకుని బతుకుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల తర్వాత సీఎం జగన్ లండన్‌కు వెళ్లి జీవిస్తారని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios