Asianet News TeluguAsianet News Telugu

మిస్టర్ బొల్లా.. అన్నదాతపై చెప్పు ఎత్తినపుడే నీ పతనం ఆరంభం..: టిడిపి నేత ఆంజనేయులు సీరియస్ (Video)

వైసిపి సానుభూతిపరుడైన అన్నదాత తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేక చెప్పుతో దాడికి యత్నించినపుడే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పతనం ప్రారంభమయ్యిందని టిడిపి నేత జివి ఆంజనేయులు పేర్కొన్నారు. 

TDP Leader GV Anjaneyulu serious on ycp mla bolla bramhanaidu
Author
Amaravati, First Published Jan 10, 2022, 1:56 PM IST

గుంటూరు: అన్నదాతపై అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (bolla bramhanaidu) చెప్పుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. వరికి గిట్టుబాటు ధర లేదని... ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బికేల ద్వారా కొనడం లేదని ఓ రైతు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల (lavu srikrishnadevarayalu) ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే కాలికున్న చెప్పుతీసి రైతుపై దాడికి యత్నించాడు. ఇలా ఎమ్మెల్యే దాడికి యత్నించిన రైతు వైసిపి సానుభూతిపురుడే కావడంతో ఈ ఘటనపై మరింత దుమారం రేగుతోంది.

ఇలా రైతును అవమానించేలా ప్రవర్తించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకోవాలని... పోలీసులు కేసు నమోదు చేయాలని  నరసరావుపేట పార్లమెంటు టిడిపి పార్టీ అధ్యక్షులు జివి ఆంజనేయులు (GV Anjaneyulu) డిమాండ్ చేసారు. ఎమ్మెల్యే బొల్లా నుండి ప్రాణహని ఉందని బాధిత రైతు నరేంద్ర ఆందోళన చెందుతున్నాడు...  దాని సంగతి ఏంటి? అని పోలీసులను ఆంజనేయులు ప్రశ్నించారు. 

Video

''ఇప్పటికే పోలీస్ కేసు పెట్టిన ఈపూరు మండలం చిన్నకొండయ్య పాలెం (chinnakondaiahpalem) గ్రామానికి చెందిన దావులూరి నరేంద్ర అసలు ఏ పార్టీ... మీ పార్టీ కాదా..? అతనిపై కేసు పెట్టిన పిఎ అంజి మీతో లేడా..? మీరు వెళ్లిన తర్వాత అంజితో గొడవ అయ్యింది అని చెబుతున్నారు. నీతో ఉన్న అంజికి అతనితో గొడవ ఎలా అవుతుంది..? ఇది మీరు కావాలని కుట్ర పూరితంగా పెట్టిన కేసు కాదా..?'' అని టిడిపి నేత ఎమ్మెల్యే బొల్లాను ప్రశ్నించారు. 

''మీరు చెప్పు ఎందుకు తీశారు మహాప్రభు... రైతు నరేంద్రపై చెప్పు చూపించారా లేక చెప్పుతో కొట్టారా..? ఎందుకు నరేంద్రపై అంత కోపం వచ్చింది..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే మసిపూసి మారేడుకాయ చేసినట్లు పోలీసులు పెట్టిన అక్రమ కేసును చదివి వినిపిస్తున్నారు. మీ మాటలు ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితి లేదు'' అని జివి ఆంజనేయులు అన్నారు.

''అన్నదాతపై చెప్పు తీసిన ఎమ్మెల్యే బొల్లా అంటూ పత్రికలు, మీడియా న్యూస్ ఇస్తుంటే వారిపై కూడా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నావు. నువ్వు చెప్పు తీసిన మాట వాస్తవం కాబట్టే నీపై మేము కేసు పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. సరే మేమంటే ప్రతిపక్షం కాబట్టి ఏదో మాట్లాడామని అనుకుందాం... మరి మీ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు జిల్లా పోలీసు అధికారులతో నరేంద్ర అరెస్టు అక్రమమని ఎందుకు మాట్లాడారు..? రైతును స్థానిక పోలీసు అధికారులపై అక్రమ నిర్బంధం విధించారని చర్యలు తీసుకోవాలని కూడా సదరు ఎంపీ ఎందుకు కోరారు..? ఇందులో నిజం లేకపోలేతే మీరు చెప్పిన కట్టుకథలు ఎంపీ గారితో చెప్పించండి అప్పుడు మేము నమ్ముతాము'' అని సూచించారు. 

''వేల్పూరులో ఆ రోజు జరిగిన సంఘటన నువ్వు చెప్పే కట్టు కథల గురించి నిగ్గు తేల్చేందుకు మా పార్టీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పదిమందితో ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటుచేసాం. ఇవాళ (సోమవారం) తమ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేల్పూర్ గ్రామంలో సందర్శిస్తున్నది నిజాలు బయటకు వస్తాయి. ఆ గ్రామాన్ని సందర్శించి వాస్తవాలను ప్రజల ద్వారా  స్వీకరిస్తాం. ఆ వివరాలను ప్రజలకు తెలియజేస్తాం... అధికారులకు విన్నవిస్తాం''  అని తెలిపారు. 

''మిర్చి రైతులు తెగుళ్లతో పంటలు నష్టపోయి అల్లాడుతుంటే మేము రైతుల వద్దకు వెళ్లి ఓదార్చడం తప్పా..? మీరు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారా లేదా..? మీ జిల్లా ఇంఛార్జి మంత్రి నష్టపరిహారం రైతులకు ఇవ్వదని తేల్చి చెప్పేశారు. దానిపై మాట్లాడండి... అంతేగాని పాత కథలు పిట్ట కథలు చెప్పుకుంటూ నాపై, మా నాయకుడు చంద్రబాబుపై విమర్శలు చేస్తే చెప్పు కథ చరిత్రలో మాసి పోదు. నీవు రైతుపై చెప్పుతీసి నప్పుడే చరిత్ర హీనుడు అయిపోయావు.. మిస్టర్ బొల్లా... నీ పతనం ప్రారంభమైంది'' అని ఆంజనేయులు హెచ్చరించారు.

''నాపై ఎన్ని విమర్శలు చేసినా నువ్వు వాస్తవంలో చేసే అవినీతి అక్రమాలు దందాలు దోపిడీలు ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యే బొల్లా పిచ్చి పీక్ స్టేజికి వెళితే ఎక్కడ ఎగబడతాడోనని ఆయన పక్కన తిరుగుతున్న నేతలు భయపడుతున్నారని వైసిపి పార్టీ వాళ్లే చెబుతున్నారు. నరేంద్ర సంఘటనతో చాలామంది నాయకులు బ్రహ్మనాయుడు పక్కన కనిపించకుండా పోయారని చెబుతున్నారు. మీరు అది చూసుకోండి బ్రహ్మనాయుడు. మీరు నన్ను విమర్శించడం మానుకోండి. అన్నదాతపై చెప్పు తీసిన ఘటనలో మీపై కేసు నమోదు చేసే వరకు టిడిపి పోరాడుతుంది'' అని జివి ఆంజనేయులు స్పష్టం చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios