పోలీసుల వల్లే దేవినేని ఉమా దాడికి గురయ్యారని ఆరోపించారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగే మార్గం వైపు దేవినేనిని మళ్లించారని ఆయన మండిపడ్దారు. ఈ విషయం తెలియక పోలీసులు చెప్పిన మార్గంలో వెళ్లినందుకే ఉమ దాడికి గురయ్యారని నరేంద్ర ఆరోపించారు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడిని ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. పోలీసులే దగ్గరుండి భౌతిక దాడులు చేయించారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగే మార్గం వైపు దేవినేనిని మళ్లించారని ఆయన మండిపడ్దారు. ఈ విషయం తెలియక పోలీసులు చెప్పిన మార్గంలో వెళ్లినందుకే ఉమ దాడికి గురయ్యారని నరేంద్ర ఆరోపించారు. ఏపీలో రక్షకులే భక్షకులైన పరిస్థితి కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేనిని ఫిర్యాదు చేయనీయకుండా ఎదురు కేసు పెడతారా..? అని ధూళిపాళ్ల నిలదీశారు.

ALso Read:సీఎంవో ఆదేశాలతోనే ఉమపై దాడి... పోలీసులూ ఈ కుట్రలో భాగమే: మాజీ మంత్రి సంచలనం

కాగా, కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధారణకు వెళ్లిన దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెదపారపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఉదయం అక్కడి నుంచి నందివాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.