సంగం డెయిరీ డైరెక్టర్లతో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. అమూల్ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతోందని ఆయన ప్రశ్నించారు.

రూ.3 వేల కోట్లను మౌళిక సదుపాయాల కోసం ఖర్చు ఎందుకు అని ధూళిపాళ్ల నిలదీశారు. అమూల్ సంస్ధకు ఆస్తులను ధారాదత్తం చేయాలని భావిస్తున్నారన్న ఆయన.. సంగం డెయిరీ విషయంలో రాజకీయం అనుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

కానీ.. ఒంగోలు డెయిరీని టార్గెట్ చేయాల్సి వస్తోందని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు డెయిరీ సేకరించే పాలను అమూల్‌కు మళ్లీస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఒంగోలు డెయిరీకి ఏడాది క్రితం రూ.3 వేలు కూడా ఇవ్వలేదని.. ఒంగోలు డెయిరీ నిర్వీర్యం అయితే మంత్రి బాలినేని ఏం చేస్తున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అమూల్ ప్రదేశ్‌గా మార్చేశారని నరేంద్ర కుమార్ సెటైర్లు వేశారు.