Asianet News TeluguAsianet News Telugu

జల వివాదం.. 40 ఏళ్ల అనుభవానికి, తెలివి తక్కువ ప్రభుత్వానికి తేడా ఇదే: జగన్‌పై దేవినేని విమర్శలు

కృష్ణా నదీ జల వివాదంపై స్పందించారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలది మూర్ఖత్వం, తెలివితక్కువ తనం, బాధ్యతారాహిత్యమంటూ ఎద్దేవా చేశారు. నారుమళ్లకు వెళ్ళవలసినవి సముద్రంలోకి వడాలదనికి మీకు మనస్సు ఎలా వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

tdp leader devineni umamaheswara rao slams ap cm ys jagan over water dispute ksp
Author
Amaravathi, First Published Jul 2, 2021, 7:53 PM IST

కృష్ణా నదీ జల వివాదంపై స్పందించారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలది మూర్ఖత్వం, తెలివితక్కువ తనం, బాధ్యతారాహిత్యమంటూ ఎద్దేవా చేశారు. నారుమళ్లకు వెళ్ళవలసినవి సముద్రంలోకి వడాలదనికి మీకు మనస్సు ఎలా వచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్య గతంలో వస్తే గవర్నర్ దగ్గర దగ్గర పంచాయతీ పెట్టి 512 టీఎంసీల, 278 టీఎంసీలు తెలంగాణకు మినిట్స్ రాసుకొని సంతకాలు పెట్టామని ఉమా గుర్తుచేశారు. 

గతంలో కృష్ణా రివర్ బోర్డు పంపకాలు చేసిందని.. సాక్షి పత్రికలో చాలా చక్కగా నీటి పంపకాలు ఇచ్చారంటూ ఆయన తెలిపారు. ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఈ డ్రామాలు జరుగుతున్నాయని ఉమా ఆరోపించారు. అక్కడ మంత్రులు మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవానికి ఒక తెలివితక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ దేవినేని అభిప్రాయపడ్డారు. తాము రాయలసీమ, పట్టిసీమ మచ్చుమర్రి కట్టి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చామని ఉమా గుర్తుచేశారు. 

Also Read:సీమ కష్టాలు తెలుసునని కేసీఆరే అన్నారు.. ఇప్పుడేమో ఇలా: జలవివాదంపై సజ్జల స్పందన

ఇవాళ కోటి రూపాయలు ఇస్తానంటే ఒక టీఎంసీ నీళ్లు ఇచ్చే ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో లేవన్నారు. పక్క రాష్ట్రంలో మన తెలుగువారు ఉన్నారంటూ జగన్ చెబుతున్నారని.. కర్నూలు జల దీక్ష చేసినప్పుడు పక్క రాష్ట్రంలో మన తెలుగు వారు లేరా అని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. 200 టీఎంసీల అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలిసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకువస్తానన్న మాట ఏమైందని దేవినేని ఉమా ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో మంత్రులు ఆ విధంగా మాట్లాడుతున్నా నోరు మూసుకొని కూర్చున్నారంటూ ఎద్దేవా చేశారు. బుద్ది జ్ఞానం ఉంటే ఈ నీళ్లు సముద్రంలోకి కాదు కాలువలోకి పంపాలంటూ ఉమా హితవు పలికారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios