టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. 

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. అంతకుముందు దేవినేని ఉమను హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయం నుంచి జూమ్ కాల్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. 

కాగా బుధవారం దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ముందస్తు ప్రణాళికతోనో మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి ఉమ వెళ్లారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా జి.కొండూరులో అలజడికి దేవినేని ఉమే కారణమని... అందువల్లే ఆయనను అరెస్ట్ చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. 

Also Read:దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. జనమే తిరగబడ్డారు, వైసీపీకి సంబంధం లేదు: దేవినేని ఇష్యూపై కొడాలి నాని స్పందన

శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ తెలిపారు. ఈ వ్యవహారంలో 100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ఉమాపై కంప్లైంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆయనపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, 307 సెక్షన్ల కిత కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దేవినేని ఉమా హత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంటూ 307సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.