ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై (andhra pradesh govt) టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు (devineni uma) మండిపడ్డారు. త్వ‌ర‌లో ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు (ap assembly budget session 2022) ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని దేవినేని పోస్ట్ చేశారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై (andhra pradesh govt) టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు (devineni uma) మండిపడ్డారు. త్వ‌ర‌లో ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు (ap assembly budget session 2022) ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని దేవినేని పోస్ట్ చేశారు. 
'బడ్జెట్ ను అంకెల గారడీగా మార్చిన వైసీపీ సర్కార్.. కేటాయించిన వాటికి చెల్లింపులు చేయట్లేదు, లేని ప్రతిపాదనలకు అసెంబ్లీ ఆమోదం లేకుండానే చెల్లింపులు చేస్తుంది. గత మూడు బడ్జెట్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు లక్షన్నర కోట్ల రూపాయ‌ల‌ బకాయిలు ఉన్నాయి. 34 నెలల్లో చేసిన అప్పులు, చెల్లింపులపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?' అని దేవినేని ఉమ ప్ర‌శ్నించారు.

అంతకుముందు వైఎస్ వివేకా హత్య కేసుపై (ys viveka murder case) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ (ks jawahar) తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. సొంత బాబాయ్ ని అతి కిరాతకంగా హతమార్చిన దోషులెవరో తెలిసాక కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) ఎందుకు దోబుచులాట ఆడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రక్త చరిత్రకు దర్శకుడు జగనే... ఆయన్ను విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అధికారం కోసమే జగన్ ఈ రక్త చరిత్రను వాడుకున్నారని మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు.

హత్యా రాజకీయాలు జగన్ కు కొత్తేమీ కాదని జవహర్ అన్నారు. మొద్దు శ్రీను (moddu srinu murder)హత్య కూడా జగన్ కనుసన్నల్లోనే జరిగినట్లు మాజీ మంత్రి సంచలన ఆరోపణలు చేసారు. చరిత్రలో తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన వారు వున్నారని... వారి జాబితాలో జగన్ ఒకరని జవహర్ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎవరిని బలి చేయబోతున్నారో చెప్పాలని జవహర్ నిలదీసారు. గత అనుభవాలను దృష్టిలో వుంచుకుని జగన్ కు తల్లి విజయమ్మ (ys vijayamma), చెల్లి షర్మిల (ys sharmila) దూరంగా వుంటే వారికే మేలని మాజీ మంత్రి అన్నారు.

ఇక వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో అలసత్వం వహించిన మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ (gautam sawang) పైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరం ఎవరు చేశారో తెలిసికూడా చట్టాన్ని జగన్ చుట్టం చేసిన సవాంగ్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.