Asianet News TeluguAsianet News Telugu

పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్లు.. ఇది పొరపాటా: బుగ్గన రాజీనామాకు ఉమా డిమాండ్

వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబులు పేమెంట్లు చేసిందని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

tdp leader devineni uma fires on double peyments
Author
Amaravathi, First Published Aug 14, 2020, 3:51 PM IST

వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబులు పేమెంట్లు చేసిందని ఆరోపించారు టీడీపీ నేత, మాజీ  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన.. పొరపాటున రూ.649 కోట్లు గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు బదిలీ అయ్యాయని ఎలా చెబుతారని దేవినేని ప్రశ్నించారు.

పెన్షనర్ల చెల్లింపులో జూలై 30న డబుల్ పేమెంట్ జరిగిందని ఆయన చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో కొందరు కాంట్రాక్టర్లకు డబుల్ పేమెంట్ జరిగిందన్నారు. ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ పేమెంట్స్ రూపంలో.. ఎంత చెల్లింపులు జరిపారో బుగ్గన వివరణ ఇవ్వాలని ఉమా డిమాండ్ చేశారు.

వీటన్నింటిపై మంత్రి బుగ్గన సమాధానం చెప్పి తీరాలన్నారు. బ్యాక్ అండ్ పేమెంట్స్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఆర్ధిక శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. ఎలా సమర్థిస్తారని దేవినేని ప్రశ్నించారు. మంత్రి బుగ్గన వెంటనే రాజీనామా చేయాలని ఉమా డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios