గుడివాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైయస్ జగన్ ఆరు నెలల సమయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టకపోతే తామేంటో చూపిస్తామంటూ సవాల్ విసిరారు. 

గుడివాడ నుంచి పోటీచేసి ఓటమిపాలైన దేవినేని అవినాష్ అనంతరం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైయస్ జగన్ కు ఎలాంటి అనుభం లేదని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వేచి చూడాలని అన్నారు. 

సీఎం జగన్ ఆరు నెలల సమయం అడిగారని అప్పటి వరకు వైయస్ జగన్ ను కానీ ఆయన పార్టీ నేతలను కాని విమర్శలు చేయోద్దన్నారు. జగన్ అడిగిన సమయంలో అభివృద్ధి చేయకపోతే మనమేంటో చూపిద్దామంటూ చెప్పుకొచ్చారు.   

చంద్రబాబు నాయుడులాంటి అనుభవజ్ఞులైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు దేవినేని అవినాష్.