Andhra Pradesh: హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో జరిగిన కోడిపందాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. తప్పుడు వ్యూహాలతో ఇంతటీ రాక్షస రాజకీయం అవసరమా? అంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
TDP leader Chintamaneni Prabhakar: హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో జరిగిన కోడిపందాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో జరిగిన కోడిపందాల కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ సోషల్‌మీడియాలో స్పందిస్తూ.. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేయకుండా.. రాజకీయంగా తనను ఎదుర్కొవాలని ప్రత్యర్థులకు సూచించారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని వైకాపాపై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఒక రోజు కోసం ఎదురుచూస్తున్నారనీ, తప్పకుండా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు.
కోడి పందేల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపటమే కొందరి అజెండాగా మారిందని ధ్వజమెత్తారు. ఇలాంటి నీచమైన ప్రచారంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసత్యాల వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం దగ్గర పడిందన్నారు. త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వానికి, కొత్త ఛానెల్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటూ మండిపడ్డారు. అంతకుముందు, పోలీసుల దాడుల గురించి సమాచారం అందుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడిపందాలు జరిగిన ప్రదేశం నుండి తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కోడిపందేల్లో పాల్గొనని వ్యక్తిని పాల్గొన్నట్లుగా చూపటమే కొందరి జెండా అజెండాగా మారిందని మండపడ్డ ఆయన.. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని, నీచమైన ప్రచారంతో కాదని హితవు పలికారు. ఇటువంటి నీచమైన ప్రచారంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అసత్యాల వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేసే సమయం దగ్గర పడిందన్నారు. ఆరోజు కోసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాక్షస రాజకీయ వికటాట్టహాసానికి త్వరలోనే ముగింపు ఉందని హెచ్చరించారు.
కాగా, అంతకుముందు కోడి పందెల గురించి పోలీసులు సమాచారం అందుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో కోడిపందేల స్థావరంపై గత రాత్రి పోలీసులు దాడులు చేశారు. చిన్నకంజర్ల శివారులో కోడిపందేలు ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిపారు. ఘటనాస్థలంలో మొత్తం 70 మంది ఉన్నారు. వీరిలో 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, వీరిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీశ్, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఏర్పడి పందేలు ఆడుతున్నారని డీఎస్పీ తెలిపారు. 21 మందిని అదుపులోకి తీసుకొని రూ.13 లక్షల నగదు, 26 వాహనాలు, 27 సెల్ఫోన్లు, 30 కత్తులు, 30 కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. అయితే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీశ్, బర్ల శ్రీనులు అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. ఈ అంశం ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.
