మేం కుట్రలు చేసేంత సీన్ మాధవ్‌కి లేదు.. ఫోరెన్సిక్ పరీక్షల్లోనే తేలుతుంది : చింతకాయల విజయ్
పని చేసుకుని వీడియోలు చేసేంత సీన్ గోరంట్ల మాధవ్‌కి లేదన్నారు టీడీపీ నేత చింతకాయల విజయ్. రాయలసీమకు చెందిన ఓ ఎంపీ వ్యక్తిగత వీడియోలకు నాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. తన పేరు వాడినందుకు అంత తేలిగ్గా వదలేది లేదని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav) తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు టీడీపీ నేత చింతకాయల విజయ్ (chintakayala vijay) . రాసలీలల వీడియో బయటకు వచ్చినప్పుడు బేషరతుగా ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదని తెలితేనే అప్పుడు మళ్లీ పదవి చేపట్టాలని చింతకాయల విజయ్ కోరారు. జుగుప్సాకరమైన వీడియోతో ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీ పరువు తీశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో తాను చేసిన కుట్ర అంటూ తనపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తాను పనిగట్టుకుని కుట్ర చేసేంత సీన్ మాధవ్‌కి లేదని విజయ్ చురకలు వేశారు.
రాయలసీమకు చెందిన ఓ ఎంపీ వ్యక్తిగత వీడియోలకు నాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఫోరెన్సిక్‌కి ఇస్తానని చెప్పిన మాధవ్, తక్షణమే కేంద్ర ఫోరెన్సిక్ విభాగంతో పని చేయించాలని వాళ్లే తెలుస్తారని విజయ్ అన్నారు. లేకుంటే తన పేరు ప్రస్తావించినందుకు తానే పరువునష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. తన పేరు వాడినందుకు అంత తేలిగ్గా వదలేది లేదన్నారు. మాధవ్ సుందర ప్రతిబింబాన్ని చూడటానికి ఇక్కడ తాము లేమన్నారు. ఆ వీడియో చూసి ఎంతమంది మూర్ఛపోయారో తెలియదని.. 25 మంది ఎంపీలు ఇస్తే, ప్రత్యేక హోదా తెస్తానని జగన్మోహన్ రెడ్డి ఆంటే, మాధవ్ లైవ్ లో ప్రత్యేక వీడియోలు పెడుతున్నాడని సెటైర్లు వేశారు. కియా సంస్థనే బెదిరించిన చరిత్ర మాధవ్‌దని విజయ్ ఆరోపించారు.
Also Read:ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పున్నట్లు తేలితే .. చర్యలు తప్పవు : తేల్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి
మరోవైపు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ Gorantla Madhav ఆరోపించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న Obscene videoపై గురువారం నాడు స్పందించారు. Morphing చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు. ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్ వివరించారు. ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.
తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నారన్నారు. ఈ విషయమై ఏ విచారణకైనా సిద్దమేనన్నారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి టెస్టుకు కూడా తాను సిద్దమేనన్నారు. ఓ వీడియోలో ఉన్నట్టుగా తనను మార్పింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ధైర్యముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనను డ్యామేజీ చేయాలని చూస్తున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ కుట్ర చేసిందన్నారు. ఈ వీడియో వెనుక వాస్తవాలను తేల్చాలని తాను పోలీసులను కోరిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.