గుంటూరు జిల్లాలో టీడీపీ నేత చంద్రయ్య హత్య: పరారీలో దుండగులు

గుంటూరు జిల్లా వెల్ధుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్యను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.   చంద్రయ్యను హత్యచేసిన తర్వాత నిందితులు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tdp Leader Chandraiah killed by unknown persons in Guntur

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Guntur జిల్లా వెల్ధుర్తి మండలం గుండ్లపాడులో Tdp నేత Chandraiah గురువారం నాడు హత్యకు గురయ్యాడు. చంద్రయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. టీడీపీ మాచర్ల టడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి అనుచరుడే చంద్రయ్య.  

 టీడీపీ గుండ్లపాడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా చంద్రయ్య కొనసాగుతున్నాడు. గ్రామ సెంటర్ లో చంద్రయ్య కూర్చున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు.చంద్రయ్యను హత్య చేసిన తర్వాత దుండగులు పారిపోయారు. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న police మృతదేహన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు.  ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ  రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలపై దాడులు, కేసులు పెరిగిపోయాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. టీడీపీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులపై కేసులు నమోదయ్యాయి.మాజీ మంత్రులు సహా ఆ పార్టీ నేతలు జైలు బాట పట్టారు. తమ పార్టీ నేతలను బెదిరించే ఉద్దేశ్యంతో వైసీపీ తప్పుడు కేసులు బనాయిస్తోందని టీడీపీ ఆరోపణలు గుప్పించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకొంటామని చంద్రబాబు హెచ్చరించారు. గత వారంలో కుప్పం టూర్ సందర్భంగా కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు గ్రామాలు వీడి వెళ్లిపోయారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు సరైన రక్షణ చర్యలు తీసుకోని కారణంగానే ఈ పరిస్థితి చోటు చేసుకొందని పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారంలోనే టీడీపీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడికి దిగారు.గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు  చేస్తే ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే వైసీపీకి చుక్కలు చూపిస్తామని లోకేష్ సహా ఆ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం తమను ఎవరెవరు ఇబ్బంి పెడుతున్నారనే విషయమై లెక్కలు రాసి పెడుతున్నామని వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. 

చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు

గుంటూరు జిల్లాలో హత్యకు గురైన చంద్రయ్య కుటుంబాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన తన నివాసం నుండి గుంటూరు జిల్లాలోని గుండ్లపాడు గ్రామానికి వెళ్లనున్నారు.చంద్రయ్యను హత్య చేయడంపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన క్యాడర్ ను హత్య చేశారని ఆయన చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios