Asianet News TeluguAsianet News Telugu

మీ లాగా లక్ష కోట్లు దోచుకోలేదు... జనం జగన్‌ను తరిమికొట్టడం ఖాయం : బుద్ధా వెంకన్న

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ చేయడం, ఆయనను రిమాండ్‌కు తరలించడాన్ని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఖండించారు. మీ మాదిరిగా లక్ష కోట్లు దోచుకోలేదని.. మీ 43 వేల కోట్ల సీజ్ గురించి మాట్లాడాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

tdp leader buddha venkanna slams ap cm ys jagan ksp
Author
First Published Sep 11, 2023, 5:45 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ చేయడం, ఆయనను రిమాండ్‌కు తరలించడాన్ని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న ఖండించారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఆధారాలు లేకుండా అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. ఈ కేసు నుంచి చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. మీ మాదిరిగా లక్ష కోట్లు దోచుకోలేదని.. మీ 43 వేల కోట్ల సీజ్ గురించి మాట్లాడాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ బృందం విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో గంటా శ్రీనివాసరావు, గండి బాజ్జీ, చిరంజీవిరావు తదితరలు ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై జోక్యం చేసుకోవాలని టీడీపీ నేతల బృందం.. గవర్నర్‌ను  కోరింది. 

ALso Read: చంద్రబాబు అరెస్ట్... టిడిపి కార్యాలయంలో టిడిపి ముఖ్య నాయకుల భేటీ (వీడియో)

గవర్నర్‌తో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గవర్నర్ వద్ద తాము ఏం చెప్పకముందే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నానని తమతో చెప్పారని అన్నారు. ఆయనకు కూడా సమాచారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని గవర్నర్ అన్నారని తెలిపారు. రాష్ట్రంలోని పరిణామాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు.  మీ జోక్యం అవసరమని చెబితే.. ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారని చెప్పారు. 

చంద్రబాబుపై సంబంధం లేని అక్రమైన కేసు పెట్టి జైలుకు తీసుకెళ్లారని మండిపడ్డారు. కావాలని చంద్రబాబును జైలుకు పంపడం దారుణమని అన్నారు. 48 గంటల పాటు రోడ్లపై తిప్పి సైకో ఆనందం పొందారని విమర్శించారు. చంద్రబాబు మనో ధైర్యాన్ని ఎప్పటికీ తొలగించలేరని అన్నారు. ఈ క్రమంలోనే ఒక దశలో అచ్చెన్నాయుడు ఉద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ వైసీపీకి మరణశాసనం అవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలియజేసే హక్కు లేదా? అని డీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందని. విమర్శించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios