మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో ముఖ్య నాయకులంతా సమావేశమయ్యారు.
అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలపై చర్చించేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులంతా ఇవాళ(సోమవారం) సమావేశమయ్యారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇకముందు ఎలా వ్యవహరించాలనే దానిపై నాయకులు చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా బంద్, పార్టీ శ్రేణులపై పోలీసుల దౌర్జన్యం, తప్పుడు కేసులు, హౌస్ అరెస్టులు వంటి అంశాలపైనా చర్చించారు. టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలని... బావోద్వేగానికి గురికావద్దని సూచించారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో మనస్తాపానికి గురయి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు టిడిపి నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వీడియో
ఈ సమావేశంలో టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, ఎం.ఏ.షరీఫ్, నక్కా ఆనంద్‌బాబు, కావలి ప్రతిభాభారతి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, పరుచూరి అశోక్ బాబు, భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, పంచుమర్తి అనూరాధ, కన్నా లక్ష్మీనారాయణ, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి, బీద రవిచంద్ర, కళా వెంకట్రావు, కంభంపాటి రామ్మోహన్‌రావు, కొమ్మారెడ్డి పట్టాభి, బొజ్జల సుధీర్‌రెడ్డి, దామచర్ల సత్య, చింతకాయల విజయ్, దారపనేని నరేంద్రబాబు, బుచ్చి రాంప్రసాద్, గురజాల మాల్యాద్రి, కావలి కృష్ణారెడ్డి, ఎ.వి.రమణ, గంటి హరీష్, బండారు అప్పలనాయుడు సూర్య ప్రకాష్, పరుచూరి కృష్ణ, దేవినేని శంకర్ నాయుడు తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
