గన్నవరంలో  టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య  సోమవారం నాడు   దాడులు జరిగాయి.  దీంతో  ఉద్రిక్త పరిస్థితులు  చోటు చేసుకున్నాయి.  ఈ పరిణామాలు  సవాళ్లకు దారి తీశాయి.  

గన్నవరం: ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు వస్తే తేల్చుకుందామని టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన సవాల్‌పై వల్లభనేని వంశీ ఎలా స్పందిస్తారోననేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. నిన్నటీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో టెన్షన్ వాతావరంణ నెలకొంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై నిన్న సాయంత్రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయ ఆవరణలో నిలిపి ఉన్న కారుకు నిప్పంటించారు. టీడీపీ, వైసీపీ వర్గీయులు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. ఈ ఘటనలో సీఐ తలకు గాయాలయ్యాయి. ఈ పరిణామాలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న నిన్న రాత్రి తీవ్రంగా స్పందించారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు 12 గంటలకు రావాలని వల్లభనేని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ఈ సవాల్ చేసిన బుద్దా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

పార్టీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వచ్చి దాడి చేయడాన్ని తప్పు బట్టారు. నీ సత్తా ఎంతో మా సత్తా ఎంతో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు రావాలని వల్లభనేని వంశీకి సవాల్ విసిరారు. ఈ సవాల్ పై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎలా స్పందిస్తారో చూడాలి.ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న గవ్నవరంలో ఈ సవాళ్ల పర్వం మరింత వేడిని రగిల్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు గన్నవరంలో 144 సెక్షన్ ను విధించారు.

also read:పట్టాభిని అరెస్టు చేశారా? లేదా కిడ్నాప్‌ చేశారా?: చంద్రబాబు

నాలుగు రోజుల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై స్థానిక టీడీపీ నేతలు స్పందించారు. వంశీపై విమర్శలు చేసిన నేతల ఇళ్లపై వంశీ మనుషులు వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ విషయమై నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వల్లభనేని వంశీ వర్గీయులు దీన్ని తట్టుకోలేకపోయారు.

 టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయంలో పార్క్ చేసిన కారుకు నిప్పంటించారు. ఈ ఘటనను నిరసిస్తూ విజయవాడ- హైద్రాబాద్ జాతీయ రహదారిపై టీడీపీ వర్గీయులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించిన టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. సోమవారం నాడు రాత్రి టీడీపీ నేత చిన్నా కారుకు వంశీ వర్గీయులు నిప్పంటించారు. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ వర్గీయులు ఆందోళన నిర్వహించారు.