Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్‌పై చెక్‌బౌన్స్‌ కేసు పెడతాం.. టీడీపీ నేత బీటెక్‌ రవి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌పై చెక్ బౌన్స్ కేసు పెడతామని తెలిపారు.

TDP Leader Btech ravi says Will File Cheque Bounce Case On CM Jagan ksm
Author
First Published Jul 20, 2023, 3:26 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌పై చెక్ బౌన్స్ కేసు పెడతామని తెలిపారు. బీటెక్ రవి గురువారం రోజున పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లి, చక్రాయపేట, వేముల మండల టీడీపీ నాయకులకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేసినప్పటికీ ఇంకా సగం మంది అకౌంట్లలో డబ్బులు పడలేదని అన్నారు. 

సీఎం జగన్ బటన్ నొక్కిన చాలా  రోజులు గడుస్తున్న ఇప్పటికీ సగం మంది అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని చెప్పారు. పంటలకు ఇన్సురెన్స్ డబ్బులు ఇచ్చినట్టుగా చెబుతునున్నారని.. ఇంకా చాలా మందికి ఆ డబ్బులు కూడా పడలేదని అన్నారు. ‘‘జనరల్‌గా ఎవరి దగ్గరినైనా అప్పు తీసుకుంటే.. వారి నుంచి చెక్ తీసుకుని బ్యాంకులో వేస్తాం. ఒకవేళ చెక్ బౌన్స్‌ అయితే వెళ్లి చెక్ బౌన్స్ కేసు పెడతాం.  సీఎం జగన్ అమ్మ ఒడి పథకం నిధులు విడుదల చేస్తున్నానని బటన్ ఒత్తి ఇన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు పడలేదని.. మా నియోజకవర్గంలోని ఈరోజు, రేపు కూడా డబ్బులు పడనివారి వివరాలను సేకరించి వాళ్ల తరఫున జగన్ మీద పోలీసు స్టేషన్‌లో చెక్ బౌన్స్ కేసు పెట్టబోతున్నాం’’ అని అన్నారు. ఈరోజు, రేపు కూడా వారి అకౌంట్లలో డబ్బులు వేసేందుకు అవకాశం ఇస్తున్నామని.. అయిన కూడా డబ్బులు పడకపోతే చెక్ బౌన్స్ కేసు పెడతామని చెప్పారు. 

ఇదిలా ఉంటే, బూతు కన్వీనర్లు దొంగ ఓట్లను కనిగొని వాటిని తొలగించె కార్యక్రమం ఎలా చెయాలి, కొత్త ఓట్లను ఎక్కించడం లాంటి విషయాలపై బీటెక్ రవి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios