Asianet News TeluguAsianet News Telugu

కడప ఎయిర్‌పోర్టులో కీలక పరిణామం: బ్రదర్ అనిల్‌తో బీటెక్ రవి భేటీ


కడపలో  ఇవాళ కీలక పరిణామం జరిగింది. వై.ఎస్. షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో తెలుగు దేశం పార్టీ నేత  బీటెక్ రవి భేటీ అయ్యారు.
 

TDP Leader BTech Ravi meets Brother Anil at Kadapa Air Port lns
Author
First Published Jan 3, 2024, 4:01 PM IST

కడప: వైఎస్ఆర్‌టీపీ అధినేత వై.ఎస్. షర్మిల  భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో  తెలుగు దేశం నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి  బుధవారంనాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో  వై.ఎస్. షర్మిల చేరుతున్న సందర్భంగా  బ్రదర్ అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు బీటెక్ రవి చెప్పారని  ప్రచారం సాగుతుంది.  వీరిద్దరి భేటీకి సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

also read:కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల

పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి బీటెక్ రవి గతంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా  బీటెక్ రవి  పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది.  

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని వై.ఎస్. షర్మిల నిర్ణయం తీసుకున్నారు.ఇవాళ ఢిల్లీకి వై.ఎస్. షర్మిల వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్. షర్మిల చేరనున్నారు.

 

బుధవారంనాడు కడపలో  వై.ఎస్. షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో  టీడీపీ నేత బీటెక్ రవి భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది.  గత ఏడాది డిసెంబర్  మాసంలో నారా లోకేష్ కు  వై.ఎస్. షర్మిల  క్రిస్ మస్ గిఫ్ట్ పంపారు .షర్మిల కూడ  నారా లోకేష్ కూడ గిఫ్ట్ పంపారు. 

పులివెందులలో  తెలుగు దేశం పార్టీలో కీలకంగా ఉన్న బీటెక్ రవి బ్రదర్ అనిల్ తో  భేటీ కావడం  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి  సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios