విజయవాడ: ఎన్నికల ప్రక్రియను వైసీపీ అపహస్యం చేస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మహేశ్వరరావు ఆరోపించారు.

బుధవారం నాడు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ అరాచకాలకు పోలీసులే వంత పాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయమై ఎస్ఈసీ, డీజీపీ, కలెక్టర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో కొన్ని చోట్ల పోలీసులు తమ పార్టీ వారిని ఇష్టారీతిలో దూషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అతిగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో తమ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్ధులను  నామినేషన్లు ఉపసంహరింపజేసుకొనేలా చేశారని ఆయన చెప్పారు.బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో  ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకొంది.

నామినేషన్ల ఉపసంహరణను  మొత్తం వీడియో తీయాలని ఎస్ఈసీ ఆదేశించారు. అభ్యర్ధి లేకుండా నామినేషన్ ఉపసంహారణకు అంగీకరించవద్దని ఎస్ఈసీ సూచించింది.ఎన్నికల ప్రక్రియను వైసీపీ అపహాస్యం చేస్తోంది