తమ హత్యను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లైవ్‌లో చూడాలనుకున్నాడని ఒక ఫోన్‌లో వీడియో రికార్డు చేయించాడని, ఇంకో ఫోన్‌లో లైవ్ పెట్టి దాడిని పర్యవేక్షించాడని ఉమా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా దౌర్భగ్యమైన ప్రభుత్వం లేదని తమపై జరిగిన దాడి పట్ల సిగ్గుతో తలదించుకోవాలని బొండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాచర్ల నుంచి గురజాల వెళ్లే వరకు ఒక్క పోలీసు కూడా తమకు సహకరించలేదని ఆయన మండిపడ్డారు. ముక్కలు ముక్కలుగా బుద్ధాను, తనను నరకాలని పక్కా స్కెచ్ గీశారని బొండా స్పష్టం చేశారు. వైసీపీ నేత కిశోర్ మేం పిల్లాడిని ముందే గుద్దుతామని 30 మందితో రెడీగా ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు.  

Also Read:రేపే వస్తా, మాచర్ల సెంటర్‌లో చూసుకుందాం.. రా: పిన్నెల్లికి బొండా సవాల్

తమపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ, ఎన్నికల కమీషన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు ప్రాణహానీ ఉన్నందున భద్రత కల్పించాలని దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బొండా స్పష్టం చేశారు. 

నీ ఊరు వచ్చిన నిరాయుధుల్ని చంపటానికి ప్రయత్నించావు, నీ ఊరికే రేపు వస్తానని అక్కడ చూసుకుందామని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బొండా సవాల్ విసిరారు. తాము ఇక్కడే పుట్టామని, ఇక్కడే చస్తామని నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని జగన్‌కు హితవు పలికారు.

మాచర్లకు వచ్చి సమాధానం చెప్పగల సత్తా తమకు ఉందని పిన్నెల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ మాచర్ల టౌన్ అధ్యక్షుడు కిశోర్‌తో ఇంకో 30 మంది గుండాలను పెట్టి తమపై జగన్ దాడి చేయించారని బొండా ఉమా ఆరోపించారు.

Also Read:పోలీసుల నుంచే పిన్నెల్లికి ఇన్ఫర్మేషన్: మాచర్ల దాడిపై బొండా వ్యాఖ్యలు

వెల్దుర్దిలో డీఎస్పీ జయరాం వారి కారులో ఎక్కించుకుని ఒంగోలు వెళ్తుండగా ముందు మరో 200 మంది గుండాలు మారణాయుధాలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని బొండా చెప్పారు.

మూడు చోట్ల తాము తప్పించుకోవడంతో వెల్దుర్దిలో కాపు కాశారని, ఆ సమయంలో పోలీసులపైనా దాడి చేశారని డీఎస్పీ తుపాకీతో బెదిరించి అడ్డుగా నిలిచారని బొండా ఆవేదన వ్యక్తం చేశారు.