Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీనా .. వైసీపీ జిల్లా అధ్యక్షుడా , వాళ్ల కంటే ఓవర్ చేస్తున్నాడు : పల్నాడు ఎస్పీపై బోండా ఉమా ఫైర్

పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా. రవిశంకర్ రెడ్డి పల్నాడు వైసీపీకీ అధ్యక్షుడిలా పనిచేస్తున్నారని.. వైసీపీ నేత కంటే ఎక్కువ చేస్తున్న ఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

tdp leader bonda uma maheshwar rao sensational comments on palnadu sp ravi shankar reddy
Author
First Published Dec 22, 2022, 2:52 PM IST

గత శుక్రవారం మాచర్లలో చోటు చేసుకున్న ఘర్షణలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డి పల్నాడు వైసీపీకీ అధ్యక్షుడిలా పనిచేస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. వైసీపీ ఇంకా ఎన్నో రోజులు అధికారంలో వుండదని ఎస్పీ గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేత కంటే ఎక్కువ చేస్తున్న ఎస్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. టీడీపీ నేతల ఇళ్లు, కార్లు తగులబెడితే కేసులు పెట్టకుండా వారిని కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. 

అటు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ , ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు నేతలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఘటనకు సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మాచర్లలో భయనక పరిస్థితిని తీసుకోస్తున్నారని, వైసిపి అరిపోయే దీపమని యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Also REad: కొందరు ఇబ్బంది పెడుతున్నారు.. మా ప్రభుత్వం వచ్చాక వదిలేది లేదు : పోలీసులకు యరపతినేని వార్నింగ్

తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో ఆ పోలీసులను వదలిపెట్టమని ఆయన హెచ్చరించారు. డిజిపి పోలీసులను అదుపులో పెట్టుకోవాలని యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన పేర్కొన్నారు. మాచర్లలో టిడిపి కార్యకర్తలు, నేతలు ధైర్యంగా వుండాలని, ఎవరు అత్మస్థైర్యం కోల్పోవద్దని శ్రీనివాసరావు సూచించారు. టిడిపి కార్యకర్తలు, నేతలకు అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. మాచర్ల ఘటనపై లీగల్‌గా పోరాటం చేస్తున్నామన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios