టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. గత నెల 23న బీసీ జనార్థన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి ఆదోని సబ్ జైలుకు తరలించారు. 

Also Read:దాడి ఘటన: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు

దుర్గాప్రసాద్‌ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్యాయత్నం కేసులో జనార్థన్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనను వర్చువల్ ద్వారా ఆళ్లగడ్డ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. జనార్ధన్‌రెడ్డికి14 రోజుల రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా బనగానపల్లె పాత బస్టాండ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.