ఇదీ కాళ్లు పట్టుకోవడం అంటే..: మోదీని జగన్ కలిసినప్పటి ఫోటోతో అయ్యన్న కౌంటర్
కేంద్ర మంత్రి అమిత్ షా తో లోకేష్ భేటీపై సెటైర్లు వేసిన వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తప్పు చేసాడు కాబట్టే చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిందని అధికార వైసిపి, రాజకీయ కక్షతోనే జగన్ సర్కార్ అవినీతి కేసుల్లో ఇరికించి ప్రతిపక్ష టిడిపి నాయకులు అంటున్నారు. ఇలా ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం కాస్తా సోషల్ మీడియాకు పాకింది. తాజాగా నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సెటైరికల్ గా స్పందించాడు. అతడికి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు టిడిపి నేత అయ్యన్నపాత్రుడు.
అమిత్ షా తో నారా లోకేష్, తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి భేటీ ఫోటోను ఎక్స్(ట్విట్టర్) వేదికన పోస్ట్ చేసాడు ఎంపి విజయసాయి రెడ్డి. ''అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగావు. ఎందరి కాళ్ళు పట్టుకున్నావు. అబ్బో! అమిత్ షా గారు నిన్ను కలవాలని తపించినట్లు మళ్లీ మీడియాలో బిల్డప్స్ దేనికి లోకేష్?'' అంటూ సెటైర్లు వేసారు.
ఈ ట్వీట్ పై టిడిపి నేత అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదాభివందనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఫోటోను జతచేస్తూ ''ఏ2 గారూ, దీనిని కాళ్లు పట్టుకోవడం అంటారు. బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని తప్పించేందుకు ఢిల్లీ వెళ్లి నువ్వు అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు మళ్లీ మళ్లీ నువ్వు పట్టిన కాళ్లు, నువ్వు పిసికిన పాదాలు గుర్తుకొచ్చాయా! కన్నింగ్ పనులు చేయడం, కాళ్లు పట్టడం అలవాటైన ఏ1, ఏ2 ప్రాణాలకి ఎవరు పిలిచినా, ఎవరు కలిసినా అలాగే కనిపిస్తుంది కదా కసాయి రెడ్డీ!'' అని ట్వీట్ చేసారు.
Read More అమిత్ షా కలవాలని అనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్.. ఆ విషయం స్పష్టం చేశారు: లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక అమిత్ షా ను తాను కలవడం కాదు ఆయనే తనను కలవాలని అనుకుంటున్నాడని కిషన్ రెడ్డితో కబురు చేసాడని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పడంతో కేంద్ర హోంమంత్రిని కలిసానని అన్నారు. చంద్రబాబు అరెస్ట్... ఆ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమిత్ షా కు వివరించినట్లు లోకేష్ స్పష్టం చేసారు.
తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్్ జైల్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు అమిత్ షా కు చెప్పినట్లు లోకేష్ తెలిపారు. చంద్రబాబు భద్రతాపరంగా ఉన్న ఆందోళనను కూడా కేంద్ర హోంమంత్రికి తెలియజేసినట్టుగా లోకేష్ చెప్పారు. సీఐడీ ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారని... దీంతో ఏయే కేసులు పెట్టారో వివరించానని తెలిపారు. ఇలా పెట్టిన కేసులన్నీ పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనని అమిత్ షాకు చెప్పినట్టుగా లోకేష్ వెల్లడించారు.