విశాఖపట్నం: పోతిరెడ్డపాడు ప్రాజెక్టు ఇరు తెలుగురాష్ట్రాల మధ్య మరోసారి వివాదాన్ని రాజేసింది. ఇంతకాలం ఎంతో సఖ్యతగా వున్న రెండు రాష్ట్రాల మధ్య తాజాగా పోతిరెడ్డిపాడు దూరాన్ని పెంచింది. దీన్ని అదునుగా చేసుకుని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్ష టిడిపి. తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా పోతిరెడ్డిపాడు, దళిత డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై స్పందిస్తూ ఎంపీ విజయసాయి రెడ్డి, ముఖ్యమంత్రి జగన్, వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

''కారులోంచి నిర్దాక్షిణ్యంగా దించేసిన తరువాత సాయిరెడ్డి గారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.అందుకే పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు స్పందించారా అని ప్రశ్నిస్తున్నారు. 
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి లాంటి వాడు, సమస్యలు అన్ని తొలగిపోయాయి.'' 

''ప్రాజెక్టులు కలిసి కట్టుకుంటాం,నీళ్లు పంచుకుంటాం అంటూ కేసీఆర్ గారి చేతిని నాకిన జగన్ గారిని ప్రశ్నించండి సాయిరెడ్డి గారు. అనుబంధం ఏమైంది?నీళ్లు తేకుండా ఈ కొత్త డ్రామా ఏంటి?  ఏడాదిగా ఒక్క ప్రాజెక్టు కూడా ఇంచు కదలకుండా కథలు ఎందుకు అని నిలదీయండి'' అంటూ ట్విట్టర్ వేదికన సూచించారు. 

''నాన్న ని చంపింది రిలయన్స్ అని  రెచ్చగొట్టి అమాయక దళిత బిడ్డలను జైలుకు పంపాడు జగన్.అదే రిలయన్స్ వారికి రాజ్యసభ్య సీటు ఇచ్చి దళితులను దగా చేసాడు.సీఎం అయ్యాకా అధికార మదంతో దళితులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు''

''జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దళిత వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ గారిని, మహాసేన రాజేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసారు''

''ఇప్పుడు మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ ని వేధించారు,చంపేస్తాం అని బెదిరించారు.  ఆఖరికి ఒక గొప్ప డాక్టర్ పై పిచ్చివాడు అని ముద్ర వేసి రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ గారు'' అంటూ అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.