లక్ష కోట్ల విశాఖ స్టీల్ ఆస్తులు వెయ్యి కోట్లకే.. విజయసాయి కుట్ర: అయ్యన్న సంచలనం
లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేవలం వేయి కోట్లతో కొట్టెయ్యాలని వైసిసి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక వైసిపి కుట్రలు దాగివున్నాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేవలం వేయి కోట్లతో కొట్టెయ్యాలని వైసిసి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అయ్యన్న ఆరోపించారు.
''తన బినామీ కంపెనీ చేత, ఈ స్టీల్ ప్లాంట్ కొనబోతున్నారు. 20 వేల ఎకరాలు, ఎకరా 5 కోట్లు, లక్ష కోట్ల ఆస్తి కేవలం వెయ్యి కోట్లకు కొట్టేస్తున్నారు. ఇందులో ఏ కుట్ర లేకపోతే మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని చాటి చెప్పాలి'' అని అయ్యన్న సూచించారు.
read more చంద్రబాబుకు షాక్... మేనిఫెస్టోను ఉపసంహరించుకోడి: టీడీపీకి నిమ్మగడ్డ ఆదేశం
''ఉత్తరాంధ్ర విధ్వంసానికి కుట్రలు పన్నుతున్న ఏ1, కొత్త ఏ2, పాత ఏ2, ఇప్పుడు ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కన్ను వేసారు. 20 వేల ఎకరాల విశాఖ స్టీల్ కొట్టేయటానికి ఈ దొంగల ముఠా స్కెచ్ వేసింది. అందుకే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కొట్టేసే కుట్ర పన్నారు.ఆర్టీసిని ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళు, వెయ్యి కోట్లతో స్టీల్ ప్లాంట్ కొనలేరా?'' అని ట్విట్టర్ వేదికన అయ్యన్న ప్రశ్నించారు.
''ఇంత పిరికి వాళ్ళు ఏంటి ఎంపీ విజయసాయి రెడ్డి? ఇంతకంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి? ఎవరి కాళ్ళు పిసకటానికి పోయావు? ఎవరి మీద కుట్రలు ప్లాన్ చేసావ్?'' అంటూ విజయసాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు అయ్యన్న.