Asianet News TeluguAsianet News Telugu

'సీఎం' అంటే... 'చేపలు' 'మాంసం' అమ్మడం కాదు, ఇందుకే తుగ్లక్ అనేది: జగన్‌పై అయ్యన్న వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగ‌న్‌పై విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. సీఎం అంటే చేపలు, మాంసం అమ్మడం కాదు... ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అని సూచించారు. ఇప్పటివరకు ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు మటన్ మార్ట్ లు తదితర నిర్ణయాల వల్ల రోడ్డున పడతాయని అయ్యన్న తెలిపారు.
 

tdp leader ayyanna patrudu slams on ap cm ys jagan over govt mutton marts decision
Author
Amaravati, First Published Sep 10, 2021, 8:53 PM IST

ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను ఏపీ ప్రభుత్వం మటన్ మార్ట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగ‌న్‌పై విమర్శలు చేశారు. సీఎం అంటే చేపలు, మాంసం అమ్మడం కాదు... ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అని సూచించారు. ఇప్పటివరకు ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు మటన్ మార్ట్ లు తదితర నిర్ణయాల వల్ల రోడ్డున పడతాయని అయ్యన్న తెలిపారు. అటు సినిమా పరిశ్రమను నాశనం చేయడానికే ప్రభుత్వం టికెట్ల అమ్మకం నిర్ణయం తీసుకుందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

Also Read:ఇది ‘‘ జగనన్న మాంసం దీవెన’’.. మటన్ మార్ట్‌లపై రఘురామ కృష్ణంరాజు సెటైర్లు

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా ఏవేవో తీసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలేదని తుగ్లక్ అనేది ఇందుకే అంటూ అయ్యన్న దుయ్యబట్టారు. ఓ ముఖ్యమంత్రివి అయ్యుండి బ్రాందీ, ఇసుక అమ్ముకుంటావా? గనులను దోచుకుంటావా? భూములను ఆక్రమించుకుంటావా? ఇప్పుడు మాంసం, చేపలు, చికెన్ అమ్ముకుంటావా? సిగ్గుండక్కర్లేదా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు

Follow Us:
Download App:
  • android
  • ios